Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ నట వారసుడుగా చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఎన్ని అవమానాలు వచ్చిన, ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు. మొదట చరణ్ ది అసలు హీరో ఫేస్ కాదని, చిరును చూసి జనం అతడి సినిమాలు చూస్తున్నారు అని విమర్శించారు. అయినా వాటినేమి పట్టించుకోకుండా.. విజయాపజయాలను లెక్కచేయకుండా చరణ్ స్టార్ హీరోగా ఎదిగాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తన నటనను మెరుగుపర్చుకుంటూ మెగా పవర్ స్టార్ గా మారాడు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. బాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా చరణ్ కు ఫ్యాన్స్ క్లబ్స్ ఎక్కువ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే.. మొదటి నుంచి చరణ్ ఆఫ్ స్క్రీన్ అయినా.. ఆన్ స్క్రీన్ అయినా తన డ్రెసింగ్ స్టైల్ తో అదరగొడతాడు. ఎంతమంది సెలబ్రిటీలు ఈవెంట్ లో ఉన్నా షో స్టాపర్ గా చరణ్ మాత్రమే నిలుస్తాడు. అది ఎన్నోసార్లు రుజువయ్యింది. మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరిగితే.. అక్కడ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అంటే చరణ్ అనే చెప్పాలి.
Hit 3 Movie: ఇండస్ట్రీలో మరో విషాదం.. నాని మూవీ షూటింగ్ సెట్లో అపశృతి..!
ఇక మరోసారి చరణ్ తన ఉబర్ కూల్ లుక్ తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న.. మేకర్స్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్నారు. ఒక గ్లోబల్ స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే ఎంత హంగామా ఉండాలి. అలాంటివేమీ ఇక్కడ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఇంకెప్పుడు ప్రమోషన్స్ మొదలుపెడతారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఈ ప్రమోషన్స్ బాధ్యత చరణ్ తన భుజ స్కందాలపై వేసుకున్నాడు. అందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేశాడు. ఈరోజే ఈ షోషూటింగ్ జరిగింది. చరణ్ ను బాలయ్య ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ షోలో చరణ్ వేసుకున్న బ్లాక్ హూడీ ఫ్యాన్స్ మనసును కట్టిపడేసింది. హాండ్స్ కు రెడ్ కలర్ లైన్స్ తో వచ్చిన ఈ హూడీ చూసి దీని రేటు ఎంత అని సెర్చ్ చేసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
Mehreen: న్యూఇయర్ కోసం మెహ్రీన్ ముస్తాబు
గ్లోబల్ స్టార్ ఏ రేంజ్ వేసుకుంటాడో ఆ రేంజ్ లోనే ఈ హూడీ ధర కూడా ఉంది. అమిరి బ్రాండ్ కి చెందిన ఈ హుడీ ధర అక్షరాలా రూ. 2 లక్షల పై చిలుకే. ఇక ఈ రేటు చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిపొయింది అంటే ఆశ్చర్యం లేదు. ఇకపోతే ఈ లుక్ RC16 కోసమే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.