Ram Chran vs Allu Arjun : మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ… ఈ వార్ ప్రత్యేక్షంగా నడుస్తుందో లేదో తెలీదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ నడుస్తునే ఉంటుంది. ముఖ్యంగా ఆ రెండు ఫ్యామిలీస్ లో ఇప్పుడు స్టార్ హోదా / టైర్ 1 హోదాలో ఉన్న రామ్ చరణ్ – అల్లు అర్జున్ గురించి ఎప్పుడూ పోల్చడం కనిపిస్తూనే ఉంటుంది. ఇక వీరి సినిమాలు రిలీజ్ అయినప్పుడు, సినిమా అనౌన్స్‌మెంట్, టీజర్, ట్రైలర్.. ఒక్కటేమిటి..? వారి సినిమాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ అప్పుడు ఈ పోలిక అనేది కామన్‌గా వినిపిస్తూనే ఉంటుంది.
ఈ మధ్య కాలంలో వీరి ఇద్దరి గురించి మరో టాక్ నడుస్తుంది. టాక్ అనడం కంటే గాసిప్ అనడం బెటరేమో. కొన్ని సార్లు ఈ గాసిప్ అని కూడా అనలేం. ఈగోతో పుట్టుకువచ్చిన ఓ రూమర్ అని కూడా అనొచ్చు. ఈగో అని ఎందుకు అన్నామో ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది.
ఎవరు గొప్పా..? నువ్వు – నేనా అనే పోరు ఇప్పుడు రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య నడుస్తుంది. వారి ఇంట్లో ఇది ఉందో లేదో తెలీదు కానీ, వారి అభిమానుల మధ్య మాత్రం ఇది పీక్స్‌లో ఉంది. వాళ్లు ఇప్పుడు ఈగోలకు వెళ్లి మరీ కొన్ని గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు.
అవి ఏటంటే..? ఈ ఇద్దరిలో ఒకరు ఒక డైరెక్టర్‌ను రిజెక్ట్ చేశారంటే… ఆటోమెటిక్ గా, కొన్ని రోజుల్లోనే ఆ స్టోరీ, ఆ డైరెక్టర్ వేరే హీరో దగ్గరకు వెళ్లినట్టు.. అక్కడ ఆ హీరో ఒకే చేసినట్టు వార్తలు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య అలాంటి కొన్ని జరిగాయి కూడా.
త్రివిక్రమ్ సినిమా…
త్రివిక్రమ్ సెలెక్టెడ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తాడు. ఆ హీరోలు తప్పా… వేరే వాళ్లతో కనీసం టచ్‌లో కూడా ఉండడు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ 3 సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాలు కూడా మంచి హిటే. ఇప్పుడు వీరి కాంబోలో నాలుగో సినిమా వస్తుందని అనౌన్స్‌మెంట్ వచ్చింది. త్రివిక్రమ్ సన్నిహితుడు, నిర్మాత నాగ వంశీ చాలా సందర్భాల్లో దీన్ని కన్ఫార్మ్ కూడా చేశాడు.
కుమారస్వామి కథ నేపథ్యంలో ఓ మైథాలజీ మైథలాజికల్ జానర్‌లో ఆ సినిమా ఉంటుందని కూడా నాగ వంశీ చెప్పాడు. అయితే బన్నీ ఈ సినిమాను పక్కన పెట్టి, అట్లీతో మూవీ చేస్తున్నాడు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ను వేరే హీరోతో చేయడానికి త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడు.
ఈ క్రమంలో, త్రివిక్రమ్ ఆ ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్‌తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడనే టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి.. తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో ఆ సినిమా చేయడానికి ఒప్పించాడనే ప్రచారం సాగింది. బన్నీ చేయలేదు కాబట్టి… ఆ ప్రాజెక్ట్ చరణ్ చేస్తున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్‌ను ట్రోల్ చేశారు.
కానీ, కొన్ని రోజులకే దీని గురించి నిజం బయటికి వచ్చేసింది. ఆ ప్రాజెక్ట్.. చరణ్ చేయడం లేదు. తారక్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగ వంశీ నుంచే వచ్చింది.
సందీప్ రెడ్డి వంగా సినిమా…
సందీప్ రెడ్డి వంగా… తన యానిమల్ సినిమా తర్వాత పవర్ ఫుల్ లైన్‌అప్ సెట్ చేసుకున్నాడు. ప్రభాస్‌తో స్పిరిట్. రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ సీక్వెల్… యానిమల్ పార్క్ సందీప్ రెడ్డి వంగా చేతిలో ఉన్నాయి. వీటితో పాటు అల్లు అర్జున్‌తో కూడా ఓ సినిమా అనౌన్స్ చేశాడు.
ఆ సినిమాను సందీప్ రెడ్డి వంగా యొక్క భద్రకాళి పిక్చర్స ప్రొడక్షన్స్, టీ సిరీస్ కలిసి నిర్మిస్తాయని కూడా ప్రకటించారు. కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో ఉన్నాడు. ఇప్పుడు అట్లీ, తర్వాత మలయాళం హీరో బసిల్ జోసెఫ్ డైరెక్షన్‌లో మూవీ. దీని తర్వాత సుకుమార్‌తో పుష్ప 3. ఇలా బన్నీకి వరుసగా మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. దీంతో అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే ప్రచారం సాగింది.
అంతే కాదు, ఆ కథను రామ్ చరణ్‌కు సందీప్ రెడ్డి వంగా వినిపించాడని, చరణ్ ఒకే చెప్పాడనే వార్తలు కూడా బయటికి పుట్టుకొచ్చాయి. ఇలా మరో సారి బన్నీ ప్రాజెక్ట్ చరణ్ చేతిలోకి వచ్చింది అంటూ వార్తలు క్రియేట్ చేశారు ఫ్యాన్స్. కానీ, సందీప్ – చరణ్ మధ్య ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి డిస్కషన్స్ జరగలేదట. బన్నీతో కూడా ప్రాజెక్ట్ రద్దు అనే చర్చలు కూడా రాలేవని సాచారం.
ఇలా… బన్నీ కాకపోతే చరణే అంటూ వస్తున్న ఈ రెండు వార్తలు ఫేకే తెలుస్తుంది. ఫ్యాన్స్ వార్స్ వల్లే ఇలాంటి గాసిప్స్ క్రియేట్ అవుతున్నాయని క్రిటిక్స్ కూడా అంటున్నారు. ఈ ఇద్దరు స్టార్ట్స్ కాస్త మారి తమ అభిమానులకు కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుందనే మాటలు వినిపస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే, అల్లు అర్జున్, రామ్ చరణే మాడం కష్టం అని అంటున్నారు.