BigTV English

Ram Charan – Vivek Agnihotri : వివాదాస్పద ద‌ర్శ‌కుడితో చ‌ర‌ణ్‌కి అవ‌స‌ర‌మా?

Ram Charan – Vivek Agnihotri : వివాదాస్పద ద‌ర్శ‌కుడితో చ‌ర‌ణ్‌కి అవ‌స‌ర‌మా?
Advertisement

Ram Charan – Vivek Agnihotri : రామ్‌చ‌ర‌ణ్ హీరోగా వివేక్ అగ్నిహోత్రి సినిమా చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారా? ఇవాళ నెట్టింట్లో ట్రెండ్ అయిన విష‌యాల్లో ఇది ప్ర‌ధాన‌మైంది. చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేయండి అని ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు పాజిటివ్‌గా స్పందించారు వివేక్ అగ్నిహోత్రి. మీ అంద‌రి ఆశీస్సులుంటే ఎంత సేపు? అన్న రీతిలో సమాధానం ఇచ్చారు. వెంట‌నే వైర‌ల్ అయింది న్యూస్‌. గ‌తేడాది కాశ్మీర్ ఫైల్స్ మూవీనిచ్చారు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్స్ మీద జ‌రిగిన ఊచ‌కోత‌, మేధావులంద‌రూ క‌లిసి క‌శ్మీర్‌ని పాకిస్తాన్‌కి అప్ప‌జెప్ప‌డానికి చేసే కుట్ర‌లు ఎలా సాగాయి? వంటి విష‌యాలతో సినిమా చేశారు. లాస్ట్ ఇయ‌ర్ బాలీవుడ్ హ‌య్య‌స్ట్ టాప్ టెన్ గ్రాస‌ర్ల‌లో క‌శ్మీర్ ఫైల్స్ కూడా ఉంది. ఇప్పుడు ది వేక్సిన్ వార్ సినిమా చేస్తున్నారు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాకు సంబంధించి త‌ర‌చూ నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టిస్తూ ఉంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్ర‌వ‌ర్షియ‌ల్ స‌బ్జెక్టుల‌ను సెల‌క్ట్ చేసుకునే డైర‌క్ట‌ర్‌గా వివేక్ అగ్నిహోత్రికి పేరుంది. ఇప్పుడు ఈ వివాదాస్పద డైర‌క్ట‌ర్‌తో రామ్ చ‌ర‌ణ్ సినిమా అనే న్యూస్ ట్రెండ్ అవుతోంది.


వెరీ గుడ్ నేష‌న‌ల్ లెవ‌ల్లో ఫేమ్ కావాలంటే, ఇలాంటి ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయాల్సిందేన‌ని కొంద‌రు అంటుంటే, ఇంత కాంట్ర‌వ‌ర్శీ ఉన్న వ్య‌క్తితో మ‌న‌కు అవ‌స‌ర‌మా? అని అంటున్నారు మ‌రికొంద‌రు ఫ్యాన్స్. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు సినిమా చేస్తున్నారు రామ్‌చ‌ర‌ణ్‌. ఆ త‌ర్వాత ఉప్పెన డైర‌క్ట‌ర్ బుచ్చిబాబు సానాతో మూవీ ఉంది. ఆల్రెడీ సుకుమార్ – చ‌ర‌ణ్ సినిమా ఇంట్రో సీన్ ఎలా ఉండ‌బోతోందో చెప్పీ చెప్ప‌కుండా ఊరిస్తున్నారు రాజ‌మౌళి. మ‌రోవైపు న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌నే మాట ఉంది. ప్ర‌శాంత్ నీల్‌, జెర్సీ డైర‌క్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి క‌థ‌లు ఎంత వ‌ర‌కు వ‌చ్చాయో ఇంకా క్లారిటీ లేదు. ఇవ‌న్నీ పూర్త‌యితేనే చర‌ణ్ – వివేక్ అగ్నిహోత్రి సినిమా క‌నీసం టాక్స్ లోకి వ‌చ్చేది. సో డోంట్ ఫిక‌ర్ అని వాళ్ల‌ల్లో వాళ్లే స‌ర్దిచెప్పుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.


Tags

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×