Upasana: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో దాంపత్య జీవితాన్ని సంతోషంగా కొనసాగించడానికి…కొన్ని జంటలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గజిబిజి లైఫ్ స్టైల్ లో భార్యాభర్త పని చేయడం మొదలు పెట్టిన తర్వాత.. భార్యాభర్త మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఫలితంగా తరచూ వివాదాలు.. ఆఖరికి విడాకులు. అయితే దాంపత్య జీవితం సంతోషంగా నిండు నూరేళ్లు సాగాలి అంటే డేట్ నైట్ తప్పనిసరి అని చెబుతోంది మెగా కోడలు ఉపాసన (Upasana). ముఖ్యంగా తమ వివాహం జరిగి 12 ఏళ్లయినా…తమ దాంపత్య జీవితంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త వహించడానికి కారణం ఈ ‘డేట్ నైట్’ అంటూ తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకుంది ఉపాసన. మరి ఈ డేట్ నైట్ అంటే ఏంటి? దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఉపాసన చెప్పిన టిప్స్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
వైవాహిక జీవితం బలపడాలంటే డేట్ నైట్ తప్పనిసరి – ఉపాసన
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన మాట్లాడుతూ..బలహీన పడుతున్న భార్యాభర్తల బంధం మధ్య ఈ డేట్ నైట్ అనేది నిజంగా ఒక వ్యూహాత్మక, ప్రయోగాత్మక అడుగు. ఈ జనరేషన్ పెళ్లిళ్లు కొన్ని పెళ్లి ఆల్బమ్స్ వచ్చే లోగే విడాకుల వరకు వెళ్తున్నాయంటే ఎవరైనా నమ్మగలమా? కానీ ప్రస్తుతం బయట పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు కూర్చొని మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. ఏదైనా సమయం మిగిలి ఉంది అంటే.. దానిని మనం ఫోన్ , టీవీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లడం లాంటి వాటికే కేటాయిస్తున్నాం. కానీ మన వారితో మనం సమయాన్ని గడపలేకపోతున్నాము. ఒక్కోసారి మనతో మనమే సమయం గడపాలి. దానినే ‘మీ టైం’ అని కూడా అంటారు. కనీసం ఒక గంట పాటు ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలి. ఇంట్లోనే వదిలేసి వాకింగ్ వెళ్లడం లేదా భాగస్వాముల పనులకు తోడుగా వెళ్లడం లాంటివి చేయాలి. అప్పుడే ఒకరికొకరు అర్థం చేసుకొని, కష్టసుఖాలలో పాలు పంచుకొని, ఎదుటివారి కష్టాలను, సుఖాలను అర్థం చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. అప్పుడు వైవాహిక బంధంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు.
మా బంధంలో అదే ప్రథమాంకం – ఉపాసన
ఇక మేమైతే ఎంత బిజీగా ఉన్నా సరే..వారంలో ఒకసారి కచ్చితంగా డేట్ నైట్ కి వెళ్తాము. కుటుంబంలో ఎంత మంది ఉన్నా సరే.. ఆ సమయంలో మేమిద్దరమే టీవీ, ఫోన్ లేదా ఇతర పనులకు స్వస్తి పలికి ఇద్దరం ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకుంటాము. డేట్ నైట్ చేయడం వల్ల దాంపత్య జీవితం మరింత బలపడుతుందని మా అమ్మ చెప్పింది. దీనిని మేము అలాగే పాటిస్తున్నాము కాబట్టి ఇప్పుడు మా వైవాహిక బంధం లో ఎటువంటి ఒడిదుడుకులకు ఛాన్స్ లేకుండా సవ్యంగా సాగడానికి కారణం అయ్యింది అంటూ ఉపాసన తెలిపింది. మొత్తానికైతే దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఇలా భార్యాభర్తలిద్దరూ తమకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవాలని ఉపాసన తెలిపింది. మరి ఉపాసన చెప్పిన ఈ టిప్స్ ను నేటితరం జంటలు పాటించి తమ మధ్య ఉండే దూరాన్ని తగ్గించుకోవాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.
Alekhya Chitti Pickles: ఎట్టకేలకు అలేఖ్య సిస్టర్స్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నటుడు.. ఏమన్నారంటే..?