BigTV English

Emilia Perez Movie Review : ఆస్కార్స్‌లో 13 నామినేషన్స్ వచ్చేంత ఏం ఉంది… ఎమిలియా పెరెజ్ మూవీ రివ్యూ

Emilia Perez Movie Review : ఆస్కార్స్‌లో 13 నామినేషన్స్ వచ్చేంత ఏం ఉంది… ఎమిలియా పెరెజ్ మూవీ రివ్యూ

రివ్యూ : ఎమీలియా పెరెజ్
నటీనటులు : సెలీనా గోమెజ్, జో సల్దానా, కర్లా సోఫియా గాస్కాన్, ఎడ్గార్ రామిరెజ్
దర్శకుడు : జాక్వెస్ ఆడియార్డ్


ఎమీలియా పెరెజ్… ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే మార్మోగిపోతుంది. 2025 ఆస్కార్ నామినేషన్ లో ఏకంగా 13 కేటగిరీల్లో నామినేషన్స్ కొట్టిన ఈ మూవీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఏకంగా 13 నామినేషన్లు కొట్టేటంత ఈ మూవీలో ఏముంది? అనే విషయాన్ని రివ్యూలో చూద్దాం.

కథ :
ఈ సినిమా మొత్తం డ్రగ్ లార్డ్ చుట్టూ తిరుగుతుంది. మెక్సికన్ డ్రగ్ లార్డ్ అయిన మానిటాస్ డెల్ మోంటో పరిస్థితుల కారణంగా తన రూపాన్ని మార్చుకోవాలనుకుంటాడు. దానికోసం రీటా అనే ట్యాలెంటెడ్ లాయర్ ని కిడ్నాప్ చేస్తారు. అయితే రీటా బాగా రీసెర్చ్ చేసి ట్రాన్స్ జెండర్ గా మారితే బాగుంటుంది అని సలహా ఇస్తుంది. ఈ డ్రగ్ లార్డ్ అమ్మాయిగా మారడానికి సహాయం చేయమని ఆ లాయర్ ని కోరుతాడు. భారీగా డబ్బు ఇస్తానని మంచి ఆఫర్ ఇవ్వడంతో, రీటా ఆ డీల్ కు టెంప్ట్ అయ్యి ఒప్పుకుంటుంది. మొత్తానికి అతనికి సర్జరీ చేయగల ఒక ఇజ్రాయెల్ సర్జన్ ని పట్టుకుంటుంది. అలాగే డ్రగ్ లార్డ్ తన భార్య సెలినా గోమేజ్ ని, పిల్లలని స్విట్జర్లాండ్ కి సురక్షితంగా తరలించే బాధ్యతను రీటాకు అప్పగిస్తాడు. ఇక నాలుగేళ్ల తర్వాత మానిటాస్ డెల్ మోంటో అనే వ్యక్తి ఎమీలియా పెరెజ్ గా తిరిగి వస్తాడు. అలాగే తన భార్య, పిల్లలను కలుసుకోవాలని, మెక్సికోకు తిరిగి రావడానికి తనకు సహాయం చేయమని రీటాను కోరుతుంది ఎమీలియా. మరి అలా తిరిగి వచ్చిన ఎమీలియాను ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా? ఆ డ్రగ్ లార్డ్ ట్రాన్స్ జెండర్ గా మారాక ఎదురైన పరిస్థితులు ఏంటి? అతనిలో వచ్చిన మార్పు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.


విశ్లేషణ :
ఈ మూవీ మొత్తం అండర్ వరల్డ్ డ్రగ్స్ నేపథ్యంలో సాగుతుంది. 2018లో వచ్చిన ఫ్రెంచ్ నవల “ఎకౌట్”ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ మూవీని నిర్మించారు. ఇందులో ముగ్గురు అమ్మాయిలు లీడ్ రోల్ పోషించారు. సెలీనా గోమెజ్, జో సల్దానా, కర్లా సోఫియా గాస్కాన్ నటించారు. రీటా నేరస్థులను కూడా స్వేచ్ఛగా తిరిగేలా చేయగల సత్తా ఉన్న లాయర్. సినిమాలో డ్రగ్ లార్డ్ నమ్మదగిన ఒకే ఒక్క వ్యక్తి. తన ఉద్యోగంలో తప్పొప్పుల విషయంలో మనస్సాక్షితో పోరాడే అమ్మాయిగా, ఆ తర్వాత రిచెస్ట్ పర్సన్ గా మరో కొత్త వేరియేషన్లో ఆమె ఆకట్టుకుంటుంది. ఇక క్లారా అదరగొట్టింది. డ్రగ్ లార్డ్ గా, ట్రాన్స్ జెండర్ గా ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా ఆమె నటన అద్భుతం. సెలీనా గోమెజ్ మాత్రం నిరాశపరిచింది. సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. మిగతా నటీనటులు తమ బెస్ట్ ఇచ్చారు.

ఎమీలియా పెరెజ్ మూవీలో థ్రిల్లర్, కామెడీ, మ్యూజికల్, డ్రామా వంటి అంశాలు మిళితమై ఉండగా, అట్రాక్టివ్ కథనంతో రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే దానికి జీవం పోసిందని చెప్పాలి. అనూహ్యమైన ట్విస్ట్ లతో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ ఫీలయ్యేలా చేస్తుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ జాక్వెస్ అడియార్డ్ చేసిన ఈ వినూత్నమైన ప్రయోగాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.

ప్లస్ పాయింట్స్
నటీనటులు
స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్

మైనస్ పాయింట్స్
సెలీనా గోమేజ్ పాత్ర
వైలెన్స్
మద్యం, ధూమ పానం వాడకం ఎక్కువగా ఉండడం

మొత్తానికి… ఇంగ్షీషు మూవీ కాబట్టి తెలుగు ప్రేక్షకులకు ఇబ్బందిగా అన్పించే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. పెద్దలు మాత్రమే చూడాల్సిన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Emilia Perez Movie Rating : 3 / 5

Related News

War 2 First Review : వార్ 2 ఫస్ట్ రివ్యూ.. హృతిక్ కంటే ఎన్టీఆరే!

Bakasura Restaurant Movie Review : బకాసుర రెస్టారెంట్ రివ్యూ : హాఫ్ బేక్డ్ మూవీ

Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?

Arebia Kadali Review: అరేబియ కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Big Stories

×