BigTV English

Chhaava: తెలుగు డబ్బింగ్.. ఆ ఒక్క మైనస్ భరించాల్సిందేనా..?

Chhaava: తెలుగు డబ్బింగ్.. ఆ ఒక్క మైనస్ భరించాల్సిందేనా..?

Chhaava:విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman utkar) దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘ఛావా’. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.700 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. పూర్తి రన్ ముగిసేసరికి రూ.1000 కోట్లకు మించి వసూలు రాబట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హిందీలో ఇంతటి ఘనవిజయం అందుకున్న ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలనే డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్చి 7వ తేదీన ఈ సినిమాను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి మరీ విడుదలకు సిద్ధం చేస్తోంది.


పెదవి విరుస్తున్న ఫ్యాన్స్..

ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ని కూడా విడుదల చేయగా.. ట్రైలర్ అంతా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ శంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరా అంటూ మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్(NTR ) ఈ పాత్రకు వాయిస్ చెప్పబోతున్నారు అంటూ గతంలో వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన వాయిస్ కి ఎన్టీఆర్ డబ్బింగ్ ఇవ్వలేదని స్పష్టం అయింది. ఈ నేపథ్యంలోనే నాసిరకంగా ఆ మెయిన్ లీడ్ వాయిస్ ఉందంటూ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఛావా సినిమా తెలుగులో డబ్ చేయాలి.. ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పాలని.m ఎంతోమంది బలంగా కోరుకున్నారు. కానీ తెలుగు వర్షన్ కి ఎన్టీఆర్ వంటి స్టార్ తో డబ్బింగ్ చెప్పించడం సాధ్యం కాదని.. బన్నీ వాసు కూడా తెలిపారు.


ఛావా తెలుగు డబ్బింగ్.. బెడిసి కొడుతున్న వాయిస్..

ఇదే విషయంపై బన్నీ వాసు మాట్లాడుతూ.. “తక్కువ సమయం ఉంది. కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్టులతోనే చెప్పించాము. ఈ సమయంలో హీరోలను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. అసలు ఎన్టీఆర్ తో ఛావా కోసం చర్చలు కూడా జరపలేదు” అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి తాను షాక్ అయ్యానంటూ తెలిపారు. ఇకపోతే ఎన్టీఆర్ వాయిస్ ను ఊహించుకున్న అభిమానులు అందరూ కూడా తెలుగు ట్రైలర్ లో విక్కీ కౌశల్ కి చెప్పిన డబ్బింగ్ విని అందరూ పెదవి విరుస్తున్నారు. ఎవడు డబ్బింగ్ చెప్పింది అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు తెలుగులో ఛావా కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది.. ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. వాయిస్ తోనే దొబ్బేటట్టుంది.. ఇంతకంటే మంచి వాయిస్, వీరత్వం ఉట్టిపడే వాయిస్ మీకు దొరకలేదా అంటూ చాలామంది పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికైతే ట్రైలర్లో విక్కీ కౌశల్ కి చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ సినిమా మొత్తం చెబితే ఫలితం మాత్రం బెడిసి కొట్టినా ఆశ్చర్య పోవాల్సిందేమి లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనినైనా దృష్టిలో పెట్టుకొని బన్నీ వాసు (Bunny Vasu), అల్లు అరవింద్ (Allu Aravindh) ఏదైనా బేస్ వాయిస్ ఉన్న వ్యక్తి చేత డబ్బింగ్ చెప్పిస్తారేమో చూడాలి. మొత్తానికి అయితే ఈ మైనస్ సినిమా ఫలితం పై గట్టిగా పడబోతోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Singer Kalpana : గతంలోనే ఆత్మహత్యాయత్నం.. ఆమె వల్లే బయటపడ్డ కల్పన..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×