Pushpa 2 : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చేసినా సరే అది సంచలనమే. గత కొన్ని రోజుల నుంచి రాంగోపాల్ వర్మ ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాకి తనదైన శైలిలో వరుసగా ట్వీట్లు వేస్తూ, సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కి ముందు నుంచి మొదలైన ఈ ట్వీట్ ల వర్షం ఇంకా ఆగలేదు. తాజాగా పుష్ప రాజ్ పాత్ర గురించి వివరిస్తూ, విశ్లేషిస్తూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.
“పుష్పరాజ్ పాత్రపై నా రివ్యూ” అంటూ మొదలు పెట్టిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma), ఆ తర్వాత ఆ పాత్రలో ఉన్న షేడ్స్ ఏంటి, ఎందుకు పుష్ప రాజ్ పాత్ర ప్రేక్షకులకు ఇంతగా కనెక్ట్ అయ్యింది, ఇప్పటిదాకా సూపర్ హీరో అంటే ఉన్న డెఫినిషన్ ఏంటి? దాన్ని పుష్ప రాజ్ ఎలా మార్చాడు? పుష్పరాజ్ పాత్ర తనకు ఎలా కనెక్ట్ అయింది? అనే విషయాలను వెల్లడిస్తూ ఆర్జీవి ఈ ట్వీట్ చేశారు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ జీవించారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూనే, ఆ పాత్రలో కన్నింగ్, ఈగో, ఇన్నోసెంట్… వంటి రకరకాల ఎమోషన్స్ కలగలిపి ఉన్నాయని రాసుకొవచ్చారు రాంగోపాల్ వర్మ.
My REVIEW of the CHARACTER of PUSHPA in #pushpa2
—Ram Gopal Varma
It is extremely rare that Indian films have sharply etched characters and it is even more rare that a star himself will ignore his own image and literally become the character
Seeing…
— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2024
ఇప్పటిదాకా సూపర్ హీరో అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఇండస్ట్రిలో ఉన్న ఒక డెఫనేషన్ అర్థాన్ని పుష్పరాజ్ మార్చారు అని చెప్పుకొచ్చారు. ఇక ఈ పాత్ర మరికొన్ని ఏళ్ల పాటు మేకర్స్ కు ఐకానిక్ రిఫరెన్స్ గా ఉండబోతోంది అని పుష్ప రాజ్ పాత్ర సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్పుని క్రియేట్ చేయబోతుందో ముందుగానే వివరించారు. తను సినిమాను చూస్తున్నంత సేపు పుష్పరాజ్ పాత్ర నిజమేమో అన్నంతగా లీనమైపోయానని, ఆ పాత్రకి అల్లు అర్జున్ ప్రాణం పోసారని రాంగోపాల్ వర్మ తన రివ్యూలో రాసుకొచ్చారు. మొత్తానికి తన సుదీర్ఘ పోస్ట్ ద్వారా పుష్పరాజ్ పాత్రతో అల్లు అర్జున్ దుమ్మురేపాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఒక పాత్రపై రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇంతగా వివరణ ఇవ్వడం ఆయన కెరీర్ లో ఇదే మొదటిసారి అయ్యి ఉండవచ్చు. ఇక అంతకంటే ముందే సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్ వర్మ మరో రివ్యూ కూడా ఇచ్చారు. “హే అల్లు అర్జున్… పుష్ప 2 (Pushpa 2) వైల్డ్ ఫైర్ కాదు… ఇది ఏకంగా వరల్డ్ ఫైర్” అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో పాటు తాజాగా పుష్పరాజ్ పాత్రపై రాంగోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ కూడా వైరల్ అవుతుంది. ఇక మరోవైపు సినిమాకు ఎంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్తున్నాడు పుష్పరాజ్. ముఖ్యంగా ‘పుష్ప 2’ హడావిడి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువగా కనిపిస్తుండడం విశేషం. రెండ్రోజుల్లో ఈ సినిమా 400 కోట్ల భారీ కలెక్షన్లు కొల్లగొట్టినట్టు ప్రచారం జరుగుతోంది.