Betting App Case : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి మరీ ట్రోల్స్ వేయించుకుంటాడు. తను ఒకప్పుడు తెరకెక్కించిన సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా కాంట్రవర్సీలకు దగ్గరగా ఉంటున్నారు వర్మ. ఎవరైనా వచ్చి కెమెరా ముందు మైక్ పెడితే చాలు.. కచ్చితంగా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలాగా లేదా వైరల్ అయ్యేలాగా ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం రామ్ గోపాల్ వర్మకు కామన్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. చూస్తుంటే మరో వివాదానికి తెర లేపినట్లు కనిపిస్తుంది.. ఆయన ఏమన్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే తప్పేంటి.?
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝాలిపించింది. యాప్స్ లతో పాటుగా వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పై కూడా కేసులు నమోదు చేసింది. ఇప్పటికే 15 మందికి నోటీసులు పంపింది. కొందరు పోలీసుల విచారణకు హాజరైయారు. అయితే తెలంగాణ సర్కార్ వీటి నిర్మూలన కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ తాజాగా ఇంటర్వ్యూ వర్మ మాత్రం డబ్బులోస్తున్నాయి చేస్తే తప్పేంటి? ఏదైనా ఆశతోనే చేస్తారు. ఫేమస్ కాబట్టే ఆ యాప్స్ వాళ్లు వీళ్ళు చెప్తే వింటారని వీళ్లకు డబ్బులిచ్చి ప్రమోట్ చేయించాడు. వాడు వంద చెప్తాడు. కానీ నీ బుద్ది ఏమైంది? నువ్వు చదువు కోలేదా? నువ్వు గడ్డి తింటున్నావా? ఇందులో సెలబ్రిటీలు చేసిన తప్పు ఏమిలేదు.. నాగార్జున కళ్యాణ్ జూవెలర్స్ యాడ్ చేస్తాడు. అందులో గోల్డ్ మోసం ఉంటుంది. నాగార్జున తప్పేంటి? అంటూ లాజిక్ ప్రశ్నలు వేసాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అవును వర్మ రైట్.. లాజిక్ తోనే చెప్పాడు అని నెటిజన్లు సపోర్ట్ చేశారు..
Also Read:తగ్గేదేలే.. బన్నీ అభిమానిపై కేసు, పంతం నెగ్గించుకున్న పవన్ ఫ్యాన్స్..!
వర్మ సినిమాల విషయానికొస్తే..
ఈయన ఈ మధ్య చేస్తున్న సినిమాలు పెద్ద సంచలనమే.. తాజాగా శారీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక అప్పటిలో వర్మ సినిమా అంటే ఒకటి క్రేజ్ ఉండేది. ‘శివ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామ్ గోపాల్ వర్మ. మొదటి సినిమాతో నే లాండ్‌మార్క్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత తను తెరకెక్కించిన ప్రతీ క్రైమ్ థ్రిల్లర్ బ్లాక్‌బస్టరే అయ్యింది. అలా తెలుగులో ఎన్నో లాండ్‌మార్క్ సినిమాలు క్రియేట్ చేసిన వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ నిలిచాడు. అటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ఇప్పుడు వివాదాలతో బిజీ అయ్యాడు. ఆయన అభిమానులు మాత్రం వర్మ నుంచి కమ్ బ్యాక్ కోరుకుంటున్నారు.