Rapo22 update : సందీప్ కిషన్ హీరోగా నటించిన రా రా కృష్ణయ్య అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించుకుంది. కానీ అవకాశాలు మాత్రం ఊహించిన రీతిలో రాలేదు. అయితే మజిలీ సినిమాకి ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు మహేష్ బాబు. తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుష్క నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది దర్శకుడుగా మహేష్ బాబును నిలబెట్టింది.
కొన్నిసార్లు టాలెంట్ ఉన్నా కూడా అది బయటపడటానికి టైం పడుతుంది. అలా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత నవీన్ పోలిశెట్టితో సినిమా చేసి మంచి పేరును సాధించాడు. మహేష్ బాబు ప్రస్తుతం యంగ్ హీరో రామ్ తో సినిమా చేస్తున్న సంగతే తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. రామ్ పోతినేని కెరియర్ లో వస్తున్న 22వ సినిమా ఇది.మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ సినిమా వస్తుంది అని అంటే అందరికీ మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే మహేష్ బాబు సెన్సిబిలిటీస్ ఏంటో రెండు సినిమాలు ద్వారా ఆల్రెడీ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు యంగ్ హీరో తో సినిమా సెట్ అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోని కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ హీరో గురించి చాలావరకు ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. అయితే మోహన్ లాల్ ను తీసుకుందాం అని ఫిక్స్ అయ్యారట. దీనికి మోహన్ లాల్ ఓకే చెప్తారా.? లేదంటే వేరే ఆప్షన్ తీసుకుంటారా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది.
ఇక రామ్ పోతినేని విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్కందా సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి కెరీర్ ని ఆ సినిమా సెట్ చేస్తుంది అని అందరూ ఊహించారు. కానీ ఆ సినిమా మరింత రిస్కులో పడేసింది. డబల్ ఇస్మార్ట్ సినిమా కోసం రామ్ చాలా కష్టపడ్డాడు. ఇక ఈ సినిమా మంచి రిజల్ట్ తీసుకురాకపోగా ఎన్నో విమర్శలు వచ్చేలా చేసింది. ఈ ప్రాజెక్టు తర్వాత ఇప్పటివరకు పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు రామ్ కి యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు హిట్ ఇస్తాడని చాలామంది ఊహిస్తున్నారు.
Also Read : All India Allu Arjun Fans & Welfare Association : వాళ్ల ఇంటర్వ్యూస్ తో మాకు సంబంధాలు లేవు