Rama Jogaiah Sastry : టాలీవుడ్‌లో స్టార్ పాటల రచయితల్లో రామజోగయ్య శాస్త్రి ఒకరు. భక్తి, కమర్షియల్ సహా అన్నీ రకాల పాటలు రాసి ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నారు. లిరిక్ రైటర్‌గా ఉంటూనే కొన్ని చిత్రాల్లో చిన్నా చితక వేషాలు వేసి నటుడిగా కనిపించాలనే తన కోరికను తీర్చుకున్నారు. అయితే ఈసారి ఆయన రూట్ మార్చారు. ఏకంగా పూర్తి స్థాయి నటుడిగా త్వరలోనే మన్నలి మెప్పించబోతున్నారట రామ జోగయ్య శాస్త్రి. అందుకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోనే కారణం. హీరోయిన్ హెబ్బా పటేల్‌తో రామజోగయ్య శాస్త్రి ఫొటో దిగి దాన్ని షేర్ చేశారు. ఆ ఫొటో చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే శాస్త్రిగారు తన లుక్‌ను అంతలా మార్చేశారు మరి. మీస కట్టు, డ్రెస్సింగ్ స్టైల్ చూసి డాన్ లుక్‌లా ఉందని అందరూ అంటున్నారు.
పాత్ర కోసం ఇంతలా మేకోవర్ అయిన రామ జోగయ్యశాస్త్రి నిజంగానే డాన్ పాత్రలో కనిపిస్తారా? లేక మరేదైనా క్యారెక్టర్‌తో మెప్పిస్తారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక నెటిజన్స్ అయితే మార్కెట్లోకి కొత్త డాన్ వచ్చారు. హాలీవుడ్ నటుడిలా ఉన్నారు శాస్త్రిగారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన స్టైలిష్ లుక్ పోస్ట్ చేసిన రామజోగయ్య శాస్త్రి సదరు డీటెయిల్స్ మాత్రం బయటకు చెప్పలేదు.
LINK: https://twitter.com/ramjowrites/status/1590583753491255296?s=20&t=KHickYIEXc5fiis6ypQbQQ