Suresh Productions: సురేష్ ప్రొడక్షన్స్ అనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ బ్యానర్లలో ఒకటి. ఈ బ్యానర్‌పై ఇప్పటికే ఎన్నో వేల గుర్తుండిపోయే సినిమాలు తెరకెక్కాయి. కేవలం సురేష్ ప్రొడక్షన్స్‌తోనే కాదు.. రామాయనాయుడు స్టూడియోస్ పేరుతో కూడా ఎన్నో సినిమాలు తెరకెక్కడానికి సహాయపడింది దగ్గుబాటి కుటుంబం. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ చిక్కుల్లో ఇరుక్కుంది. మామూలుగా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకు ఏదో ఒక విధంగా సమస్యలు రావడం కామనే. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మారిన ప్రభుత్వం వల్ల రామానాయుడు స్టూడియోస్‌కు, సురేష్ ప్రొడక్షన్స్‌కు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా సురేష్ ప్రొడక్షన్స్‌కు ఎలాంటి ఊరట లభించలేదు.
వాటిపై ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోస్‌కు సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి. ఆ భూముల చుట్టూ ఇప్పుడు కొత్తగా ఒక వివాదం చేరింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో రామానాయుడు స్టూడియోస్ అనేది కేవలం ఫిల్మ్ సిటీ కోసం అనే కాకుండా ఇతర అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అందుకే భూముల వ్యవహారాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. రామానాయుడు స్టూడియోస్ అనేది కేవలం ఫిల్మ్ సిటీ వ్యవహారాల కోసమే ఉపయోగిస్తే బాగుంటుంది అంటూ ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే వారి భూములపై ఎఫెక్ట్ పడింది.
పిటీషన్ వెనక్కి
అసలు గత ప్రభుత్వం రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studios) విషయంలో జగన్ ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో చెప్పాలంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఈ విషయంపై విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీజసులను సవాలు చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ పిటీషన్ దాఖలు చేసింది. దానిపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సురేష్ ప్రొడక్షన్స్ పిటీషన్‌లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఇప్పుడు వారి పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో వేరే దారి లేక సురేష్ ప్రొడక్షన్స్ సైతం ఈ పిటీషన్‌ను వెనక్కి తీసుకుంది.
Also Read: సినీ ఇండస్ట్రీ విషాదం.. నటుడు విష్ణు కన్నుమూత
రామానాయుడు స్టూడియోస్ హిస్టరీ
1964లో సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) ప్రారంభమయ్యింది. సురేశ్ బాబు, వెంకటేశ్, రానా కలిసి ఇప్పుడు దీనిని ముందుకు నడిపిస్తున్నారు. వెంకటేశ్, సురేశ్ బాబు తండ్రి రామానాయుడు ఈ సురేశ్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. ముందుగా సినిమా షూటింగ్స్‌కు సహాయపడేలా ఉంటుందని రామానాయుడు స్టూడియోస్‌ను ప్రారంభించారు రామానాయుడు. ఆ తర్వాత దాని నుండి సురేశ్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా పుట్టింది. అప్పట్లో రామానాయుడు బ్యానర్‌లో సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయమని నటీనటులు చెప్పుకునేవారు. రామానాయుడు నిర్మించిన సినిమాల్లో క్వాలిటీ ఉంటుందని ప్రేక్షకులు ఇప్పటికీ నమ్ముతారు. రామానాయుడు మరణానంతరం ఈ ప్రొడక్షన్ హౌస్, ఫిల్మ్ స్టూడియోస్ బాధ్యత పూర్తిగా సురేశ్ చూసుకుంటున్నారు. వెంకటేశ్, రానా హీరోలుగా బిజీ అయిపోయారు.