Tamannaah Bhatia: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా (Tamannaah) ఎంతోమందికి ఫేవరెట్ హీరోయిన్. ముఖ్యంగా ప్రేక్షకులకే కాదండోయ్ సినీ సెలబ్రిటీలకు కూడా ఈమె అంటే ఇష్టం. ఆ ఇష్టమే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిందనే ఒక వార్త తాజాగా వెలుగులోకి రావడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తమన్నా అంటే ఎంతో మందికి అభిమానం. తన అందచందాలతోనే కాదు నటనతో కూడా ఎంతో మందిని మెప్పించింది. ఇండస్ట్రీలోకి వచ్చి 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీగా మారిన తమన్నా..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్స్ రావడంతో తమన్నాకి కాస్త అవకాశాలు తగ్గిపోయాయి.. కానీ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకుపోతోంది. సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ గా పనిచేస్తే రూ.3 నుండి రూ .4కోట్లు తీసుకునే ఈమె.. ఐదు నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం సుమారుగా రూ.2కోట్లకు పైగానే అందుకుంటుందని సమాచారం. ఇదిలా ఉండగా తమన్నా వల్ల ప్రముఖ సీనియర్ హీరోయిన్ రంభ (Rambha) జీవితంలో ఇబ్బందులు కలగజేసిందట. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
అలాంటి పని చేసిన రంభ భర్త..
సాధారణంగా వాట్సప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఏ ఫ్లాట్ఫామ్ అయినా సరే.. భార్య ఒక ఫోటో పెడితే, భర్త లైక్ చేయలేదంటే, భార్యకు కోపం వస్తుంది. సోషల్ మీడియాలో భార్యను వదిలేసి వేరే వాళ్ళను ఫాలో అయితే ఇక ఆ కోపం కట్టలు తెంచుకుంటుంది. అలా రంభ జీవితంలో కూడా జరిగిందట. రంభ తన భర్త ఏం చేశాడో..? తాను ఏం చేసిందో చెప్పి , అందరిని ఆశ్చర్యపరిచింది.. 1990లలో నటి రంభ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన అందచందాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె, ఊహించని ఇమేజ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె, అనుకోకుండా కుటుంబ జీవితంలో బిజీ అయిపోయింది.
తమన్నా వల్లే జరిగిందంటున్న రంభ..
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ.. సోషల్ మీడియాలో మీ భర్తను ఫాలో కావట్లేదు ఏంటి?అనే ప్రశ్నకు సమాధానం తెలిపింది. రంభ సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తన భర్తతో తనని ఫాలో కావాలని అడిగిందట. కానీ ఆయన మాత్రం తమన్నా భాటియాని ఫాలో అయ్యారట. దాంతో రంభకి కోపం వచ్చిందట. నన్ను ఫాలో అవ్వు అని రంభ ప్రత్యేకంగా అడిగారట. కానీ ఆయన మాత్రం వినలేదట. అందుకే ఇన్స్టా లో తన భర్తని ఇప్పటికీ ఫాలో కావట్లేదని తెలిపింది. మొత్తానికి అయితే తన భర్తని తాను ఫాలో కావట్లేదు అని తెలిపి ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఈ విషయాన్ని ప్రేక్షకులు తప్పుగా తీసుకుంటారేమో అని భావించిన ఈమె.. “తమన్నా నచ్చలేదా ? అని అడిగి జనాలు తప్పుగా అనుకుంటారని, తన మాటలను కూడా సరిచేసుకుంది. తమన్నాని ఫాలో కావద్దని చెప్పలేదు..అలా ఫాలో అవ్వడం నాకు సంతోషమే. కానీ భార్యగా నాకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా..? అంటూ తన వే లో చెప్పుకొచ్చి రూమర్స్ కి తావు ఇవ్వకుండా చేసింది. ఇక చాలా వరకు నెటిజన్స్ కూడా రంభకి మద్దతు పలుకుతున్నారు. కన్నడ, తెలుగు, తమిళ్ భాషలో 100కి పైగా సినిమాలలో నటించిన ఈమె, 2017లో కెనడా వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ పద్మనాథన్ (Indrakumar Padmanathan)ను పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.