Jack: డీజె టిల్లుని హీరోయిన్ కొట్టిందా? అంటే, అవును కొట్టిందని చెబుతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ ( Sidhu Jonnalagadda). “డీజే టిల్లు” మరియు “టిల్లు స్క్వేర్” చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సిద్ధు.. తనదైన కామెడీతో యూత్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు “జాక్” (Jack) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి తనదైన కామెడీతో పాటు యాక్షన్ కూడా చేయబోతున్నాడు సిద్ధు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి “కొంచెం క్రాక్” అనే ట్యాగ్‌లైన్ ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జాక్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సిద్ధు ఒక ప్రైవేట్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది అతని మునుపటి కామెడీ పాత్రల కంటే చాలా భిన్నమైన పాత్రగా చెప్పవచ్చు. ఇక హీరోయిన్‌గా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య (Sidhu Jonnalagadda) నటిస్తోంది. అయితే.. తాజాగా హీరోయిన్ వైష్ణవి తనని కొట్టిందంటూ.. ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ.
తనే కొట్టి తనే సారీ చెబుతుంది!
జాక్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. గుడ్ యాక్ట్రెస్‌గా వైష్ణవి చైతన్యలో బెస్ట్ థింగ్ ఏంటని అడగ్గా? సిద్ధు చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. తను ఒక మంచి నటి. ఒక్కసారి సీన్ అనుకుంటే ఒకటి రెండు టేక్స్ కంటే ఎక్కువ తీసుకోము. కానీ అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లిడితే.. తను నవ్వేసి డైలాగ్ మర్చిపోతుంది. మరిచిపోయిన వెంటనే కొడుతుంది కూడా. తనే నవ్వుకొని తనే కొట్టేస్తది. లేకపోతే తనే సారీ సారీ అని చెబుతుంది. ఇలా సీన్ జరుగుతున్నప్పుడు మధ్యలో కట్ అయితే.. నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంది. ఏమైందని చాలా ఫాస్ట్‌గా మారిపోతుంది. కానీ తను మాత్రం వెంటనే సారీ సారీ అని చెప్పేస్తుందని.. సిద్ధు చెప్పుకొచ్చాడు. అలాగే.. డైలాగ్ చెప్పేకంటే ముందే, నాకు నేనే లోపల లోపల నవ్వుకుంటానని.. అందుకే కామెడీ డైలాగ్స్ అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయని చెప్పుకొచ్చాడు. మొత్తంగా.. వైష్ణవి చైతన్యకు ఏదైనా జరిగినప్పుడు మరిచిపోయి కొట్టడం ఒక అలవాటు అనే విషయం తెలిసిపోయింది.
జాక్ పై మంచి అంచనాలు!
ఇప్పటికే రిలీజ్ అయిన జాక్ టీజర్ మరియు ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. సిద్ధు యాక్షన్ సన్నివేశాలతో పాటు తనదైన కామెడీతో అదరగొట్టినట్టుగా ప్రమోషనల్ కంటెంట్ చెప్పేసింది. అలాగే.. హీరోయిన్ వైష్ణవితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా పర్ఫెక్ట్‌గా కనిపిస్తోంది. అయితే.. ట్రైలర్‌లో బూతు డైలాగ్‌లు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది విమర్శించారు. దీనిపై సిద్ధు స్పందిస్తూ, ఆ డైలాగ్‌లు పాత్రకు సరిపోతాయని, సెన్సార్ గురించి తనకు స్పష్టత లేదని చెప్పాడు. మొత్తంగా.. డీజె టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న సినిమా కావడంతో.. జాక్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి జాక్ ఎలా ఉంటుందో చూడాలి.