PM Modi Letter to kcr: మాజీ మంత్రి కేసీఆర్ కు.. ప్రధానీ మోదీ లేఖ రాశారు. గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్ సోదరి మృతిచెందడంపై ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని మోదీ సంతాపాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. కాగా కేసీఆర్ సోదరీ సకలమ్మ ఇటీవల అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. మాజీ సీఎంకు మొత్తం ఎనిమిది మంది సోదరీమణులు ఉండగా.. వారిలో సకలమ్మ ఐదవ సోదరి. ప్రతి రాఖీ పండుగ నాడు తన సోదరి చేతికి రాఖీ కట్టేదని గుర్తు చేసుకున్నారు.
సోదరి మరణాన్ని చింతిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, మీకు సానుభూతి తెలుపుతున్నానని పీఎం మోదీ కేసీఆర్‌కు లేఖలో వివరించారు. సోదరి జ్ఞాపకాలు మీ నుంచి ఎప్పటికీ దూరం కావని అన్నారు. ఆ భాధ నుంచి త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మోదీ లేఖలో ఆకాంక్షించారు. ప్రధానీ మోదీ లేఖ రాసిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కేసీఆర్ సోదరీ సకలమ్మ ఇటీవల అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. మాజీ సీఎంకు మొత్తం ఎనిమిది మంది సోదరీమణులు ఉండగా.. వారిలో సకలమ్మ ఐదవ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఆమె గత కొంత కాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. తీవ్రంగా వ్యాధి క్షీణించడంతో ఇటీవల సికింద్రబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్చారు. కొంత కాలంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె జనవరి 25న మృతి చెందారు. సోదరి మరణ వార్త విని మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి రాఖీ పండుగ నాడు తన సోదరి చేతికి రాఖీ కట్టేదని గుర్తు చేసుకున్నారు.
Also Read: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. గడువు కోరిన ఎమ్మెల్యేలు
ఇదిలా ఉంటే. శాసన సభ మండలిలో పార్టీ విప్ లను పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాశన సభలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యో కేపీ వివేకానంద కేపీ వివేకానంద గౌడ, మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను నియమిస్తూ తాజాగా ఆదేశాలిచ్చారు. కేసీఆర్ ప్రస్తుతం శాసన సభలో బీఆర్ఎస్ పక్ష.. ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి మాజీ స్పీకర్ మధుసూధన చారి పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు.. సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. మీడియాతో చిట్‌చాట్ చేసిన సీఎం.. కేసీఆర్‌పై ఫైరయ్యారు. కేసీఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్తశుద్ధి లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీలు 56 శాతం , 17శాతం ఎస్సీలు ఉన్నారని తెలిపారు. 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వర్గీకరణ కోసం ఎన్నోఏళ్లుగా మాదిగలు, మాలలు పోరాటం చేస్తున్నారన్నారు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అక్క చీటి సకలమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు కేసీఆర్ గారికి సంతాప సందేశాన్ని ప్రధాని పంపించారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని… pic.twitter.com/TQ3ofz46du
— BRS Party (@BRSparty) February 4, 2025