Ramya: ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయ నాయకులకు, సినిమా సెలబ్రిటీలకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కర్ణాటక సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం రాజకీయ నాయకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తుంటే దానికి సినీ సెలబ్రిటీలు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు మాత్రం ఈ ఆరోపణలపై పెద్దగా స్పందించకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ తాజాగా ఒక హీరోయిన్ మాత్రం ఈ విషయంపై స్పందించింది. ఓపెన్‌గా కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. రమ్య అలియాస్ దివ్య స్పందన. సినిమావాళ్లు రాజకీయ నాయకులకు ఈజీ టార్గెట్ అవుతున్నారని అన్నారు.
అనుబంధం లేదు
కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్.. యాక్టర్ల దగ్గర నుండి తమకు సపోర్ట్ రావడం లేదని చేసిన ఆరోపణలపై రమ్య స్పందించింది. ‘‘డీకే శివకుమార్ చెప్పింది పూర్తిగా తప్పు కాదు. నటీనటులుగా మాకు కూడా బాధ్యతలు ఉంటాయి. డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ భాషకు ఎంత ఖ్యాతి తీసుకొచ్చారో చూడండి. ఒకప్పుడు రాజకీయ నాయకులకు, సినిమావాళ్లకు మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అదే మిస్ అవుతోంది’’ అంటూ డీకే శివకుమార్ చెప్పిన మాటలతో కొంతవరకు అంగీకరించింది డీకే శివకుమార్ మాత్రమే కాదు.. మరికొందరు రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై సీరియస్‌గానే ఉన్నారు.
బెదిరించకూడదు, భయపెట్టకూడదు
‘‘ఆ అనుబంధం అనేది ఇప్పుడు లేదు. యాక్టర్లుగా మా భాష కోసం, మట్టి కోసం, కల్చర్ కోసం, నీటి కోసం నిలబడడం మా బాధ్యత. యాక్టర్లుగా మేము పబ్లిక్‌ను కూడా ప్రభావితం చేస్తాం. వారిపై మా ప్రభావం ఎంతైనా ఉంటుంది. మేము నమ్మే సిద్ధాంతాల గురించి మేము మాట్లాడడం అత్యవసరం. ఎవరు ఏ వైపుకు ఉన్నా కూడా మేము అనుకున్నది చెప్పాల్సి ఉంటుంది. కానీ అలా చేయాలా వద్దా, తమకు నచ్చిన విషయంపై మాట్లాడాలా వద్దా అనేది పూర్తిగా ఒక ఆర్టిస్ట్‌పైనే ఆధారపడి ఉంటుంది. అలా మాట్లాడడం కోసం వారిని ఎవరూ బెదిరించకూడదు, భయపెట్టకూడదు’’ అంటూ రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూనే వారిపై కౌంటర్లు వేసింది రమ్య (Ramya).
Also Read: పైరసీ ఉద్యమం.. నేను లీడ్ చేస్తా.. ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు కామెంట్స్ వైరల్.!
రష్మికకు బెదిరింపులు
‘‘ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీనటులు వారి పొలిటికల్ ఐడియాలజీలను పక్కన పెట్టి మరీ వేర్వేరు విషయాలపై ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉంటారు. కానీ ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై తమ అభిప్రాయం చెప్పినప్పుడు యాక్టర్లు ట్రోల్ అవుతున్నారు. అవి వారి పనిపై ఎఫెక్ట్ చూపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రతీ యాక్టర్‌పై ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఫీమేల్ యాక్టర్లు రాజకీయ నాయకులకు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు. ఇటీవల రష్మిక మందనా తన సొంత భాషను మర్చిపోయినందుకు తనకు తగిన గుణపాఠం చెప్పాలని రవి గనిగ అన్నారు. ఇలా బెదిరించడం ఎప్పటికీ కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులు అయ్యిండి ఇలాంటివి చేయడం ఆపేయాలి. దీనివల్లే యాక్టర్లు పెద్దగా ఓపెన్‌గా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు’’ అంటూ బోల్డ్‌గా మాట్లాడింది రమ్య.