Rana Naidu 2: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లీడర్ సినిమా ద్వారా హీరోగా పరిచయమై అనంతరం విభిన్నమైనటువంటి కథ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న వారిలో రానా (Rana)ఒకరు. రానా కేవలం హీరోగా మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో కూడా నటించడానికి వెనకాడరు. ఇలా హీరోగా నటిస్తున్న రానా బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు కొట్టేశారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం రానా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.
అల్లకల్లోలాన్ని చూస్తారు…
ఇక రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు (Rana Naidu)అనే ఒక బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇప్పుడు దానికి సీక్వెల్ గా రానా నాయుడు2(Rana Naidu 2)ను నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నుంచి ఒక ఆసక్తికరమైన వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రానాతో పాటు సునీల్ గ్రోవర్ (Sunil Grover)కూడా కనిపించారు. ఇక ఈ సిరీస్లో సునీల్ గ్రోవర్ సైతం పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నారని తాజాగా విడుదలైన ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియోలో సునీల్ కనిపించగానే ఎవరూ ఊహించని సిట్యుయేషన్స్ చూస్తామనే ఫీలింగ్ కలుగుతుందని రానా తెలిపారు. అదే విధంగా ఈ సిరీస్ తో ప్రేక్షకులకు వైల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సిరీస్ తో ఊహించని అల్లకల్లోలాన్ని మీరు చూడబోతున్నారని రానా రానా నాయుడు 2 పై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు.
ఇది అసలు ఊహించలేదు…
ఇక ఈ వీడియోలో భాగంగా సునీల్ కూడా మాట్లాడుతూ… నేను రానా ఇద్దరం ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తామని అస్సలు ఊహించలేదు. “రానా నాయుడు” పవర్ మూవ్స్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌లతో నిండినది ఇలాంటి ఒకసారి కొత్త ప్రపంచంలోకి నేను నా స్టైల్ లో ఎంట్రీ ఇచ్చానని తెలిపారు. నెట్ ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ గురించి చెప్పగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒప్పుకున్నానని సునీల్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇకపోతే ఈ సిరీస్ లో రానాతో పాటు వెంకటేష్ కూడా నటించిన విషయం తెలిసిందే. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను లోకోమోటివ్ బ్యానర్ పై సుందర్ అరోన్ నిర్మించగా,అర్జున్ రాంపాల్, కృతి ఖర్బంద, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ వంటి వారు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ జూన్ 13వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది.