BigTV English
Advertisement

Tripthi Dimri: దీపికా కంటే త్రిప్తి రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువనా…. వంగా నిర్ణయం సరైనదేనా?

Tripthi Dimri: దీపికా కంటే త్రిప్తి రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువనా…. వంగా నిర్ణయం సరైనదేనా?

Tripthi Dimri: సందీప్ రెడ్డి(Sandeep Reddy) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న స్పిరిట్ (Spirit)సినిమా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే ప్రభాస్ సందీప్ డైరెక్షన్లో కూడా స్పిరిట్ సినిమాకు కమిట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించడం కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను (Deepika Padukone) ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా సినిమా నుంచి తప్పుకున్న దీపిక స్పిరిట్ స్టోరీ కూడా లీక్ చేయడంతో సందీప్ రెడ్డి ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


రెమ్యూనరేషన్ కారణమా….

ఇక దీపికా పదుకొనేను ఈ సినిమా నుంచి తప్పించడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో నటించడం కోసం దీపిక భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అందుకు కారణమని తెలుస్తుంది. దీపిక తనకు ఇండస్ట్రీలో ఉన్న మార్కెట్ ఆధారంగా ఈ సినిమాలో నటించడం కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా రెమ్యూనరేషన్ తో పాటు తన స్టాఫ్ ఖర్చులను కూడా నిర్మాతలే భరించాలని పలు డిమాండ్ చేయటంతో ఈమెను సినిమా నుంచి తప్పించారని తెలుస్తుంది. ఇలా దీపిక సినిమా నుంచి తప్పకున్న తర్వాత స్పిరిట్ సినిమాలోకి యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ఎంట్రీ ఇచ్చారు ఇదే విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు.


కోట్ల రూపాయలు ఆదా…

ఇలా స్పిరిట్ సినిమాలో త్రిప్తి దిమ్రి నటించడం కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను త్రిప్తి దిమ్రి కేవలం 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈమె దీపికా కంటే 16 కోట్ల రూపాయలు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవటం గమనార్హం. దీపిక ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాతలకు కూడా రూ. 16 కోట్ల రూపాయలు మిగిలాయనే చెప్పాలి. అయితే దీపికా పదుకొనే ఫస్ట్ ఈ సినిమాకు ఎంపిక చేయడం వెనుక కారణం లేకపోలేదు. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నారు. అలాగే ఇదివరకు ప్రభాస్ నటించిన కల్కి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో స్పిరిట్ సినిమాకు కూడా మార్కెట్ పరంగా దీపిక హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతోనే తనని ఈ సినిమాలో తీసుకున్నారు. ఇలా ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్ ను కాదని త్రిప్తి దిమ్రిని ఈ సినిమాలో తీసుకోవడంతో సందీప్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈమెను తీసుకోవడంలో సందీప్ రెడ్డి నిర్ణయం సరైనదేనా అంటూ ప్రభాస్ అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×