BigTV English
Advertisement

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చేసిన రణబీర్ కపూర్

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చేసిన రణబీర్ కపూర్

Brahmastra 2: సౌత్ లాగానే బాలీవుడ్ కూడా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌పైనే ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు నుండి ఎన్నో పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యి దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. వాటిని ఎలాగైనా బీట్ చేయాలనే ఆలోచనతో కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నుండి ఒక భారీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌తో ముందుకొచ్చింది. అదే ‘బ్రహ్మాస్త్ర’. భారీ క్యాస్టింగ్‌తో యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన సినిమా ఇది. ఇక ఈ సినిమాను సగంలోనే ఆపేసి మిగతాది సీక్వెల్‌లో చూసుకోమని చెప్పారు మేకర్స్. ఇంతకాలం తర్వాత ఇప్పటికి ఈ సీక్వెల్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు హీరో రణబీర్ కపూర్.


సీక్వెల్ ఉందా?

రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రమే ‘బ్రహ్మాస్త్ర’. వారితో మరికొందరు స్టార్లు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక మైథాలజీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని హిందీలో మాత్రమే కాదు.. ఇతర అన్ని భాషల్లో కూడా స్వయంగా ప్రమోట్ చేసి దీనికి మంచి రీచ్ తీసుకొచ్చారు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ లభించినా కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. అయితే ఈ మూవీకి కీలకంగా నిలిచింది మాత్రం క్లైమాక్స్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర సినిమాను ఆపేసి, మిగతాది సీక్వెల్‌లో చూసుకోమని చెప్పారు మేకర్స్. కానీ అప్పటినుండి ఇప్పటివరకు ‘బ్రహ్మాస్త్ర 2’ (Brahmastra 2) గురించి అసలు ప్రస్తావన లేదు.


ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్స్

మార్చి 15న రణబీర్ కపూర్ (Ranbir Kapoor) భార్య ఆలియా భట్ పుట్టినరోజు. అందుకే తాజాగా ప్రీ బర్త్ డే బ్యాష్‌ను ఏర్పాటు చేశారు. ఇక ‘బ్రహ్మస్త్ర’లో రణబీర్‌కు జోడీగా ఆలియానే నటించింది. అందుకే ఈ ప్రీ బర్త్ డే బ్యాష్ సందర్భంగా ఈ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు రణబీర్ కపూర్. ‘‘బ్రహ్మస్త్ర 2 అనేది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కల. దానికి సంబంధించిన కథ మొత్తం తన మైండ్‌లో రెడీగా ఉంది. ప్రస్తుతం తను వార్ 2తో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ రిలీజ్ అయిన వెంటనే బ్రహ్మస్త్ర 2 కోసం సిద్ధమవుతాడు. ఈ మూవీ కచ్చితంగా తెరకెక్కుతుంది. ఇప్పటివరకు దీని గురించి మేము పెద్దగా చెప్పలేదు. కానీ త్వరలోనే ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్స్ అన్నీ బయటికి వస్తాయి’’ అని తెలిపాడు రణబీర్.

Also Read: రెండేళ్లలోనే రూ.3,300 కోట్లు రాబట్టిన ఏకైక హీరోయిన్.!

చాలా కష్టపడతాడు

ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతిలో నితీష్ తివారీ ‘రామాయణ్’తో పాటు సంజయ్ లీలా భాన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ కూడా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా అందించాడు రణబీర్. ‘‘సంజయ్‌తో పనిచేయడం ఎప్పుడూ స్పెషలే. నేను అలాంటి కష్టపడే మనిషిని ఇంకెక్కడా చూడలేదు. తను క్యారెక్టర్‌ను, ఎమోషన్స్‌ను, మ్యూజిక్‌ను, ఇండియన్ కల్చర్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. తనతో కలిసి పనిచేయడం చాలా అలసటగా అనిపిస్తుంది. కానీ యాక్టర్‌గా అది ఎంతో తృప్తి కూడా ఇస్తుంది. తను ఆర్ట్‌ను మెరుగుపరిచే వ్యక్తి’’ అని అప్‌కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చేశాడు రణబీర్ కపూర్.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×