Ranveer Allahbadia : యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా (Ranveer Allahbadia) చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తులో భాగంగా ముంబై, అస్సాం పోలీస్ బృందాలు శుక్రవారం అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లగా, పోలీసులకు షాక్ తగిలింది.
పరారీలో రణవీర్
బీర్ బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానల్ తో పాపులర్ అయ్యాడు రణవీర్ అలహాబాదియా. అలాగే అతను ఒక పాడ్ కాస్టర్ కూడా. ‘ఇండియాస్ గాట్ లాటెండ్’ (India’s Got Latent) అనే యూట్యూబ్ షోలో రణవీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రముఖ హాస్య నటుడు సమీర్ రైనా ఈ షోలో పాలు పంచుకున్న సమయంలో తల్లిదండ్రులపై అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేసి జనాల ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా రణవీర్ అలహాబాదియాపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అందులో ఒకటి ముంబైలో కాగా, మరొకటి అస్సాంలో ఫైల్ అయింది.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో 31 ఏళ్ల కంటెస్టెంట్ తో అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే తన యూట్యూబ్ నుంచి సమయ్ రైనా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లను డిలీట్ చేశాడు. అంతేకాకుండా తన ఏకైక లక్ష్యం జనాలను నవ్వించడం మాత్రమేనని, క్షమాపణలు కోరాడు. ఇక ఇప్పటికే దర్యాప్తు ముగిసిందంటూ రైనా ఇంస్టాగ్రామ్ లో ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే రణవీర్ అలహాబాదియాను పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ అతను హాజరు కాకపోవడంతో రెండవసారి సమన్లు జారీ చేశారు.
ఇంట్లోనే విచారణ…
రణవీర్ అలహాబాదియా తన ఇంట్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దానిని పోలీసులు రిజెక్ట్ చేయడంతో అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేయడానికి ఇంటికెళ్లిన ముంబై, అస్సాం రెండు బృందాల పోలీసులు… ఇంటికి తాళం వేసి ఉండడంతో ఒట్టి చేతులతో తిరిగిరాక తప్పలేదు. మరోవైపు రణవీర్ అలహాబాదియా తనపై ఇప్పటికే నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ లను కలిపి ఒకే ఎఫ్ఐఆర్ గా రాయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
50 మంది స్టేట్మెంట్లు
ఈ నేపథ్యంలోనే ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ అనే షోలో పాల్గొన్న కంటెస్టెంట్లతో పాటు జడ్జిలలు కూడా సమన్లు జారీ చేశారు. ఎపిసోడ్ మొదటి నుంచి వివాదం జరిగిన తేదీ వరకు ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో పడ్డారు. శుక్రవారం పోలీసులు ‘ఇండియాస్ గాట్ లాటెండ్’ షో వీడియో ఎడిటర్ ప్రథమ్ సాగర్ స్టేట్మెంట్ ను నమోదు చేశారు. కొద్దిసేపు విచారించిన తర్వాత అతన్ని ఇంటికి పంపించారు. ఇక మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు షోలో పాల్గొన్న వారితో సహా మొత్తం 50 మందికి స్టేట్మెంట్లు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా గురువారం నటుడు రఘురామ్ కూడా రైనా షో న్యాయ నిర్ణయితల ప్యానెల్ లో ఉన్న కారణంగా అతని స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు.