Indian Railways: గత కొద్ది రోజులుగా నార్త్ ఇండియాలో కొద్ది రోజులుగా రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కుంభమేళా రైళ్లపై ప్రయాణీకులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అయితే, రైళ్లపై దాడులు, రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. నిజానికి రైళ్లను ధ్వంసం చేయడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేరం. వివిధ దేశాలకు వేర్వేరు శిక్షలు ఉన్నాయి. భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఏ శిక్షలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ భారత్
భారత్ లో రైలును ధ్వంసం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రైల్వే చట్టం 1989 ప్రకారం, నేరస్థులకు జరిమానాతో పాటు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఎవరైనా రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే ప్రజా ఆస్తికి నష్టం నిరోధక చట్టం 1984 ప్రకారం శిక్ష విధిస్తారు. రైలు ప్రమాదాలకు కారణం అయితే, తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి 5 ఏండ్ల జైలు శిక్ష విధిస్తారు.
ఇక ఇతర దేశాలలోనూ రైల్వే ఆస్తుల ధ్వంసంతో పాటు రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే వారికి కఠిన చర్యలు తీసుకుంటారు. రైల్వే ఆస్తులపై దాడి చేసే వారికి ఎలాంటి శిక్షలు విధిస్తారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ అమెరికా
అమెరికాలో రైళ్లను ధ్వంసం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఆయా కేసు తీవ్రతను బట్టి వేల డాలర్ల జరిమానాతో పాటు పలు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. రైళ్లపై దాడి చేసిన వారికి శిక్షగా పబ్లిక్ టాయిలెట్స్ ను క్లీన్ చేయిస్తారు.
⦿ బ్రిటన్
బ్రిటన్ లోనూ రైళ్లను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. క్రిమినల్ డ్యామేజ్ యాక్ట్, 1971 ప్రకారం రైలును ధ్వంసం చేయడం వల్ల జరిమానా లేదంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. రైల్వే ఆస్తి నష్టం, ప్రయాణీకులకు కలిగిన ప్రమాదాన్ని బట్టి శిక్ష ఉంటుంది.
⦿ జర్మనీ
జర్మనీలో రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే, వాటి తీవ్రతను పట్టి జరిమానా, శిక్ష ఉంటుంది. రైళ్లను డ్యామేజ్ చేస్తే వేల యూరోల జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
⦿ జపాన్
రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే జపాన్ లో కఠినమైన శిక్షలు విధిస్తారు. ఆయా కేసు తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధిస్తారు.
⦿ చైనా
చైనాలోనూ రైళ్లను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు విధిస్తారు. చైనాలోబలమైన నిఘా వ్యవస్థ ఉంటుంది. నిందితులను త్వరగా పట్టుకుని భారీగా జరిమానాలను విధించడంతో పాటు రేర్ కేసులలో జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది.
⦿ ఉత్తర కొరియా
ఉత్తర కొరియాలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే.. జీవిత ఖైదు విధించడంతో పాటు వెట్టి చాకిరీ చేయిస్తారు.
⦿ దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలోనూ రైల్వే ఆస్తులకు పాల్పడితే భారీ జరిమానాలు విధించడంతో పాటు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. సో, ఇకపై రైల్వే ఆస్తులు ధ్వంసం అనే ఆలోచన చేయకపోవడం మంచిది.
Read Also: కుంభమేళా రైళ్లపై వరుస దాడులు, నిందితులకు ఇక చుక్కలే!