Big Stories

Ishan- Shreyas: బీసీసీఐ పైకి ఇషాన్, శ్రేయాస్ రివర్స్ స్వింగ్..

 

- Advertisement -

ishan kishan and shreyas iyer news

- Advertisement -
Shreyas Iyer, Ishan Kishan lose BCCI contracts(Sports news headlines): కాలం మారుతోంది. క్రికెట్ లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంతకుముందులా టెస్ట్ మ్యాచ్ లు, వన్డేలు ఆడే పరిస్థితి లేదు. రాబోయే కాలమంతా టీ 20లపైనే నడిచేలా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలో కూడా టీ 20 లీగ్ లు వచ్చేశాయి. దేశంలో ఆడే ప్రముఖ క్రీడాకారులందరూ వివిధ దేశాలు వెళ్లి క్రికెట్ ఆడి,  చేజేతులా సంపాదిస్తున్నారు. ఈరోజున జాతీయ జట్టులో చోటు లేదని ఎవరూ బాధపడటం లేదు. ఇది వాస్తవ ప్రపంచం

ప్రస్తుతం బీసీసీఐ ఈ వాస్తవ ప్రపంచంలోకి రావడం లేదు. ఇంకా 1983 వరల్డ్ కప్ కాలం నాటి రూల్స్ పట్టుకుని వేలాడుతోందనే విమర్శలు నెట్టింట మిన్నంటుతున్నాయి. ఇప్పుడు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ చేసిన నేరం ఏమిటి? వారినెందుకు బీసీసీఐ బలి తీసుకుందని సీనియర్లు మండిపడుతున్నారు.

నిజానికి టీ 20 క్రికెట్ వైట్ బాల్ లో జరుగుతుంది. ఆ బాల్ కి తగినట్టుగా వీరిద్దరి బ్యాటింగ్ టెక్నిక్, టైమింగ్ యాప్ట్ అవుతోంది. అదే వారిని ఇంతదూరం తీసుకువచ్చింది. కానీ టెస్ట్ మ్యాచ్ లు, దేశవాళీ అంతా రెడ్ బాల్ లో జరుగుతుంది. అక్కడ వీరి టైమింగ్ కుదరడం లేదు.

Read more: పాండ్యాను ఎందుకు తొలగించలేదంటే? బీసీసీఐ అధికారి వివరణ..

దీంతో తమ టెక్నిక్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా టీ 20, వన్డేలు బాగా ఆడతాడు. సౌతాఫ్రికా పర్యటనలో తీసుకెళ్లి టెస్ట్ మ్యాచ్ లో వేశారు. అంటే నువ్వు టీ 20కి పనికి రావనే ముద్ర వేసినట్టే లెక్క. దీంతో ఇషాన్ కిషన్ ఎదురుతిరిగాడు. ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఆడలేదు.

ఒక ఉదాహరణ చెప్పాలంటే శుభ్ మన్ గిల్ కూడా అదే ఇబ్బంది పడ్డాడు. తను ఓపెనర్ గా అయితే బాగా ఆడతాడు. ఎందుకంటే పేస్ ని ఈజీగా ఎదుర్కొంటాడు. తీసుకెళ్లి ఫస్ట్ డౌన్ లో పెట్టారు. తన దగ్గరికి వచ్చేసరికి స్పిన్ బౌలింగ్ వస్తోంది. ఈ డౌన్ మార్చడంతో ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు కుదురుకున్నాడు. అది శ్రేయాస్ వల్ల కాలేదు. ఇలాగే ఆడితే ఐపీఎల్ నుంచి కూడా తీసిపారేస్తారు? మొత్తం కెరీర్ క్లోజ్ అయిపోతుందని భయపడ్డాడు. తప్పదని బీసీసీఐను ఎదిరించాడు.

శ్రేయాస్, ఇషాన్ కూడా టెస్ట్ క్రికెటర్లు అనే ముద్రలోంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నారు. దీనినే బీసీసీఐ పెద్దలు ఎందుకు ఆలోచించడం లేదు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఎందుకివ్వడం లేదు. మీరు టీ 20లో తీసుకోండి, మానేయండి. అది మీ ఇష్టం. ఆటగాళ్ల భవిష్యత్తుతో ఆటలాడుతూ, వారి కెరీర్ ని నాశనం చేసేలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలం మారింది.. మీరెందుకు మారడం లేదు, బీసీసీఐ కూడా బూజు పట్టిన నిబంధనలను పక్కనపెట్టి, ఆధునిక కాలానికి తగినట్టు కొత్తవి రాసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. నేటి యువతపై పెత్తనాలు పనిచేయవని, వారిని అర్థం చేసుకుని, వారి దారిలో వెళితే అందరికీ శ్రేయస్కరం అని కొందరు పెద్దలు బీసీసీఐకి మర్యాదగా చెబుతున్నారు. మీ సొంత పెత్తనాలతో భారత క్రికెట్ ని నాశనం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News