Rasha Thadani: మామూలుగా హీరోహీరోయిన్లు తమ సెలబ్రిటీ క్రష్ గురించి పెద్దగా బయటపెట్టారు. అది కూడా ఒకే ఇండస్ట్రీలో పనిచేసే వారు అయితే అలాంటి విషయాలు బయటపెట్టడానికి అస్సలే ఇష్టపడరు. కానీ ఒక స్టార్ కిడ్ మాత్రం తనకు కియారా అద్వానీ భర్త అంటే క్రష్ అని ఓపెన్‌గా చెప్పేసింది. కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న మినిమమ్ గ్యారెంటీ యంగ్ హీరోల్లో ఒకడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్‌పై ఒక స్టార్ కిడ్ మనసు పారేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన సెలబ్రిటీ క్రష్ సిద్ధార్థ్ మల్హోత్రా అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది స్టార్ కిడ్.
ప్రమోషన్స్‌లో బిజీ
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon).. తాజాగా తన కూతురు రాషా థడానిని కూడా హీరోయిన్‌గా పరిచయం చేసింది. తాజాగా అజయ్ దేవగన్ వారసుడు ఆమన్ దేవగన్ (Aaman Devgn), రాషా థడాని (Rasha Thadani) కలిసి ఒకే సినిమాతో డెబ్యూ చేసి ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. హీరోయిన్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టక ముందే తన సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ తన ఫేస్‌ను ఆడియన్స్‌కు అలవాటు చేసింది రాషా. ఇక తన తల్లి రవీనా కూడా ఎక్కువగా రాషా ఫోటోలు షేర్ చేస్తూ ఉండేది. అందుకే తన డెబ్యూ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. రాషా, ఆమన్ కలిసి నటించిన ‘ఆజాద్’ (Azaad) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అప్పటినుండే క్రష్
‘ఆజాద్’ సినిమా థియేటర్లలో విడుదలయిన తర్వాత పెద్దగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. అయినా కూడా రాషా, ఆమన్ కలిసి దీనిని ప్రమోట్ చేయడం ఆపడం లేదు. అలా ఒక ప్రమోషన్స్‌లో భాగంగా తన సెలబ్రిటీ క్రష్ ఎవరు అనే ప్రశ్నకు సిద్ధార్ధ్ మల్హోత్రా అని సమాధానమిచ్చింది. ఆమన్ కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇక తన సెలబ్రిటీ క్రష్ ఎవరు అని అడగగా దియా మిర్జా అని బయటపెట్టాడు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ నుండే సిద్ధార్థ్ తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది రాషా. తను చెప్పిన సమాధానాన్ని చాలామంది ఆడియన్స్ ఒప్పుకున్నారు. డెబ్యూ మూవీతోనే చాలామంది ఆడియన్స్‌కు కూడా క్రష్‌గా మారిపోయాడు సిద్ధార్థ్.
Also Read: ఏడు నిమిషాల పాత్ర.. జీవితాన్నే మార్చేసిందంటున్న తాప్సీ..
స్టైల్ మారింది
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో జెన్ జీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra). కానీ ఆ తర్వాత తను పెద్దగా యూత్‌ఫుల్ సినిమాల్లో నటించలేదు. ఇక గత కొన్నేళ్లుగా సిద్ధార్థ్ స్టోరీ సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. బయోపిక్స్, ఆర్మీ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలనే ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటున్నాడు. దానివల్ల ఆడియన్స్‌కు కూడా సిద్ధార్థ్ సినిమాలు బోర్ కొట్టేశాయి. అది గ్రహించిన ఈ బాలీవుడ్ యంగ్ హీరో.. తాజాగా తన రూటు మార్చాడు. చాలాకాలం తర్వాత ఒక ప్రేమకథతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ‘పరమ్ సుందరి’ అనే మూవీతో బిజీగా ఉన్నాడు.