Air India Express Flight Tickets: విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఎయిరిండియా బంఫర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే గాలి మోటార్ లో చక్కర్లు కొట్టే ఛాన్స్ అందిస్తోంది. ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక ఉన్న వారికి చక్కటి అవకాశం కల్పిస్తోంది. మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని భారతీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఫ్లాష్ సేల్ పేరిట తక్కువ ధరకే విమాన టికెట్లు అందిస్తోంది. ఈ సేల్ భాగంగా కేవలం రూ. 1,444కే టికెట్ అందిస్తోంది. ఈ టికెట్ ద్వారా వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసుకునే అవకాశం ఉంది.
ఒకే ఒక్క రోజు స్పెషల్ ఆఫర్
ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన ఎక్స్ ప్రెస్ ఫ్లాష్ సేల్ టికెట్ల బుకింగ్ ఆఫర్ ఒకే రోజు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 13న టికెట్లను బుక్ చేసుకోవాలి. ఈ రోజు స్పెషల్ సేల్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు నవంబర్ 19 (2024) నుంచి మొదలుకొని, వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఆరు నెలల వ్యవధిలో నచ్చిన రోజు విమానం ఎక్కవచ్చు. వింటర్ విడిదికి వెళ్లే వారితో పాటు సమ్మర్ వెకేషన్ కు వెళ్లే వారికి ఈ స్పెషల్ ఆఫర్ చక్కగా ఉపయోగపడనుంది.
ఎప్పిక చేసిన రూట్లలో అవకాశం
ఎంపిక చేసిన రూట్లలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లాష్ సేల్ లో భాగంగా ఎక్స్ ప్రెస్ వాల్యూ ఆఫర్ ద్వారా రూ.1599కే టికెట్లు అందిస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ డాట్ కామ్ లో లాగిన్ అయితే, జీరో కన్వీనియన్స్ ఫీజ్ ఉంటుందని విమానయాన సంస్థ వెల్లడించింది. ఎక్స్ ప్రెస్ లైట్ ఫేర్స్ లో భాగంగా అదనంగా 3 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. 15 కిలోలు దాటితే మాత్రం రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ విమానాల్లో 20 కేజీల లగేజీకి రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్ లో లాయల్టీ మెంబర్స్ కు ఎక్స్ ప్రెస్ బిజనెస్ కేటగిరీలో 25 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. బిజినెస్ కేటగిరీలో బోయింగ్ 737కు చెందిన 8 విమానాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటితో పాటుగా విద్యార్థులు, వైద్యులు, నర్సులు, ఆర్మీ సిబ్బంది, సీనియర్ సిటిజన్లకు స్పెషల్ రాయితీలు కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సో, ఎవరికైనా విమాన ప్రయాణం చేయాలనే కోరిక ఉంటే, వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి! ఎందుకంటే, ఈ ఒక్కరోజే అవకాశం ఉంది.
Warm up your winter with our #FlashSale! 🧣✨ It’s #TimeToTravel with exclusive offers just for you:
✈️ Xpress Lite fares starting at ₹1444 + Zero Convenience Fee
💼 Member-exclusive 25% off Xpress Biz fares
🍲 25% off ‘Gourmair’ meals, seats, and Free Xpress Ahead priority… pic.twitter.com/GTmmGnFTbK— Air India Express (@AirIndiaX) November 11, 2024
Read Also:తక్కువ ధరకే విమాన టికెట్లు బుక్ చేసుకోవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!