Amaran: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా రాజ్ కుమార్ పెరిసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళీ కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ముకుంద్ పాత్రలో శివ కార్తీకేయన్, అతని భార్య ఇందు పాత్రలో సాయిపల్లవి నటించారు అని చెప్పడం కన్నా జీవించారు అని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా.. దీవాళీ విన్నర్ గా నిలిచింది. మంచి విజయంతో పాటు రికార్డ్ కలక్షన్స్ అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 250 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. లాంగ్ రన్‌లో మూడు వందల కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా అమరన్ నిలిచింది. ఇక త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Ananya Panday: బికినీలో లైగర్ బ్యూటీ సెగలు.. ఏముందిరా బాబు
అమరన్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా ఏ సినిమా అయినా కూడా నాలుగు వారాల్లో ఓటీటీలోకి అడుగుపెడుతుంది. అయితే.. అమరన్ మంచి పాజిటివ్ టాక్ అందుకోవడం, కలక్షన్స్ రాబట్టడం చూసి.. మేకర్స్ ఇప్పుడప్పుడే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకుండా ఉండేటట్లు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.
ఓటీటీకి వచ్చేముందే సినిమాపై హైప్ పెంచడానికి వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ చేస్తారు. అలానే అమరన్ నుంచి బాగా వైరల్ అయిన ఏ రంగులే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తూ వచ్చింది. ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టిన ఏ రంగులే వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
Meenakshi Chaudhary: అక్కినేని ఇంటి కోడలిగా మీనాక్షీ.. అసలు నిజం ఇదే.. ?
ముకుంద్ , ఇందు తొలి పరిచయం, వారి ప్రేమ, ముకుంద్ కోసం ఇందు ఏం చేసింది.. ? ఇలా ప్రతి ఒక్క ఫ్రేమ్ ను ఈ వీడియోలో చూడొచ్చు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను తెలుగులోఅనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు. జీవీ ప్రకాష్ తన మ్యూజిక్ తో ఒక మ్యాజిక్ చేశాడు. మరి థియేటర్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. ? ఇక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి.