BigTV English

Merlet Ann: ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం లేదా.. ఇంటిమేట్ సీన్స్‌కు సంబంధించిన ప్రశ్నపై నటి ఫైర్

Merlet Ann: ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం లేదా.. ఇంటిమేట్ సీన్స్‌కు సంబంధించిన ప్రశ్నపై నటి ఫైర్

Merlet Ann: ఇంటిమేట్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడం హీరోలకు అయినా, హీరోయిన్లకు అయినా కష్టమైన విషయమే. కానీ అవే సీన్స్ గురించి చాలామంది నెగిటివ్‌గా మాట్లాడతారు. ఆ నెగిటివిటీని పక్కన పెట్టి ఇదంతా ప్రొఫెషన్‌లో భాగమే అని వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తుంటారు నటీనటులు. తాజాగా ఒక నటి మాత్రం ఇంటిమేట్ సీన్స్ గురించి పదేపదే ప్రశ్నలు ఎదురవుతుంటే సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మలయాళ నటి మేర్లెట్ ఆన్ ఇంటిమేట్ సీన్స్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంటిమేట్ సీన్స్ గురించి పదేపదే హీరోలను ఎందుకు అడగరు అంటూ అందరిపై ఒకేసారి రివర్స్ అయ్యింది ఈ యంగ్ బ్యూటీ.


ఫోర్స్ చేయలేదు

ఇటీవల జోజూ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘పని’ (Pani). ఈ సినిమా మలయాళంలో పాటు ఇతర భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులో స్నేహ అనే పాత్రలో కనిపించి అలరించింది మేర్లేట్ ఆన్ థామస్. అందులో పలు ఇంటిమేట్, రొమాంటిక్ సీన్స్‌లో కూడా బోల్డ్‌గా నటించి మెప్పించింది మేర్లేట్. దాని వల్ల తను పలు నెగిటివ్ కామెంట్స్‌ను ఎదుర్కుంటోంది. అందుకే ఓపిక కోల్పోయిన మేర్లేట్.. ‘‘నన్ను ఎవరూ ఇంటిమేట్ సీన్స్‌లో యాక్ట్ చేయడానికి ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే అవి కథకు ముఖ్యం అనుకున్నాను కాబట్టే చేశాను’’ అంటూ తాను ఇంటిమేట్ సీన్స్ ఇష్టపడి ప్రొఫెషన్‌లో భాగమనుకునే చేశానని తేల్చిచెప్పింది మేర్లేట్.


వాళ్లను అడగండి

‘‘అలాంటి సీన్స్‌లో ఎందుకు నటించావంటూ ప్రేక్షకులంతా నన్నే ప్రశ్నిస్తున్నారు. అసలు ఇలాంటి ప్రశ్నలు హీరోలకు ఎందుకు వేయరు అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంటుంది. వాళ్లకు కూడా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఉంటారు కదా.. యాక్టింగ్ అనేది ఒక ప్రొఫెషన్. పని సినిమా అనేది నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటికి తీసుకొచ్చింది’’ అని చెప్పుకొచ్చింది మేర్లేట్ ఆన్ (Merlet Ann). తను చెప్పిన వ్యాఖ్యలకు చాలామంది ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారు. పెళ్లయిన హీరోయిన్లు కూడా రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తే అసలు ఏంటిది అంటూ తనపై విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. కానీ పెళ్లయిన హీరోలు ఏం చేసినా ఎవరూ నెగిటివ్‌గా మాట్లాడరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read: నేను స్టార్ కిడ్ అయ్యింటే కథ వేరేలా ఉండేది.. అదా శర్మ షాకింగ్ కామెంట్స్

దర్శకుడిగా డెబ్యూ

మాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు జోజూ జార్జ్. ఆయన మొదటిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమానే ‘పని’. ఈ మూవీ థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అంతే కాకుండా ఓటీటీలో కూడా విడుదలయ్యి అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా వల్ల మేర్లేట్ ఆన్‌కు మంచి గుర్తింపు లభించింది. పని తన నాలుగో సినిమా అయినా అందులో తన పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేసింది. జనవరి 16న సోనీ లివ్‌లో ‘పని’ రిలీజ్ అయ్యింది. ఆల్ ఇండియా ఎంటర్‌టైన్మెంట్ కేటగిరిలో గూగుల్ ట్రెండ్స్‌లో కూడా ఈ మూవీ ర్యాంక్ అయ్యింది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×