Best Web series in Netflix 2024 : ఓటిటి ప్లాట్ ఫామ్ వెబ్ సిరీస్ లకు అడ్డాగా మారింది. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లు కొన్ని ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటే, మరికొన్ని ఒంటరిగా మాత్రమే చూడగలిగే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
3 బాడీ ప్రాబ్లమ్స్ (3 Body Problem)
ఈ వెబ్ సిరీస్ 2024 March 21 నెట్ఫ్లిక్స్ (Netflix) లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ ని గేమ్ అఫ్ త్రోన్స్ క్రియేటర్స్ డి.బి. వీస్, అలెగ్జాండర్ వూ రూపొందించారు. ఇది ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్. మొదటి ఎపిసోడ్ చూస్తే మిగతా అన్ని ఎపిసోడ్స్ చూడాలనిపిస్తుంది. వెబ్ సిరీస్ లో సైంటిస్టులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు. అలా ఎందుకు చనిపోతున్నారో సస్పెన్స్ గా ఉంటుంది. హీరోయిన్ కు ఒక హెల్మెట్ ఉంటుంది. ఆ హెల్మెట్ పెట్టుకోగానే ఒక గేమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ విజువల్స్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లే విధంగా ఉంటాయి. ఈ సిరీస్ లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వలన, ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఈ వెబ్ సిరీస్ ఉండదు. ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏ కిల్లర్ పేరడక్ష్ (A Killer Paradox)
ఈ వెబ్ సిరీస్ దక్షిణ కొరియా క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామిడీ టెలివిజన్ సిరీస్. 2024 February 9 న నెట్ఫ్లిక్స్ (Netflix) లో విడుదల అయింది. దీనికి లీ చాంగ్ హీ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ లో హీరో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత వరుసగా మరికొన్ని మర్డర్ కేసులు అతని మీద పడతాయి. ఈ హత్యలు ఎవరు చేశారని ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. హీరోకి ఒక సైకలాజికల్ సూపర్ పవర్ ఉంటుంది. ఆ పవర్ తో వెబ్ సిరీస్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కూడా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండదు. ఒంటరిగా చూడగలిగే విధంగా ఉంటుంది. ఇంగ్లీష్, కొరియన్, హిందీ ఆడియోతో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ ని ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ (Avatar The Last Airbender)
ఈ వెబ్ సిరీస్ 2024 February 22 నెట్ఫ్లిక్స్ (Netflix) లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ లో స్నో కింగ్డమ్, ఫైర్ కింగ్డమ్, ఎర్త్ కింగ్డమ్ ఇలా నాలుగు కింగ్డమ్స్ ఉంటాయి. అవతార్ అనే కుర్రాడి కోసం ఫైర్ కింగ్డమ్ వెతుకుతూ ఉంటుంది. అతనిని వెతికి అంతం చేయాలని ఫైర్ కింగ్డమ్ పథకం వేస్తుంది. ఈ సిరీస్ చిన్నపిల్లలు చూడటానికి చక్కగా ఉంటుంది. ఈ సిరీస్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ 8 ఎపిసోడ్ లుగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో అన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి.