Satyabhama Today Episode December 21 th : నిన్నటి ఎపిసోడ్ లో.. పుట్టినరోజు కాబట్టి క్రిష్ కి నిజం చెప్పాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. తన తండ్రిపై ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్న విషయం క్రిష్ కి చెప్పాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక విధంగా అది అడ్డుపడుతుంది. చెప్పాలనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి క్రిష్ ని తీసుకెళ్లి పోతున్నారు. ఇక బెడ్ రూమ్ లో సత్య క్రిష్ కి నిజం చెప్పాలని అనుకుంటుంది కానీ అప్పుడే మహదేవయ్య పిలుస్తాడు. క్రిష్ ఒక ఐదు నిమిషాల్లో బాపు పిలుస్తున్నాడు మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్లిపోతాడు. ఆ దేవుడి దగ్గర సత్య మనసులో కోరికను చెప్తుంది. కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా క్రిష్ కనిపిస్తాడు. దేవుడి ముందు తన మనసులోని మాటను చెప్పాలని అనుకుంటుంది. కానీ భైరవి వచ్చి అడ్డుపడుతుంది. ఆ తర్వాత జయమ్మ వచ్చి అడ్డు పడుతుంది. క్రిష్ కు నిజం చెప్పాలనుకున్నా కూడా సత్యకు ఆటంకాలు ఎదురవ్వడంతో చెప్పలేకపోతుంది.. నందిని, సంధ్యాలు బర్త్ డే పార్టీకి వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంధ్యా నందిని రావడంతో క్రిష్ సత్యాలు సంతోషపడతారు. నువ్వు రానన్నావు మరి ఎందుకు వచ్చావని నందినితో సెటైర్లేస్తాడు క్రిష్. ఇక పదండీ అందరు లోపలికి అని సత్య తీసుకెళ్తుంది. సంధ్యను మాత్రం సంజయ్ తన బెడ్ రూమ్ కి తీసుకెళ్లి లోపల లాక్ చేస్తాడు. సంధ్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి కాసేపు రొమాన్స్ చేసుకుంటారు. సంధ్యా నాకు భయమేస్తుంది నేను వెళ్ళిపోతాను అంటే వెళ్లాలనుకుంటే వెళ్ళు తలుపు తీసుకుని వెళ్లొచ్చు అనేసి సంజయ్ అంటాడు. కానీ సంధ్య మాత్రం వెళ్ళదు. ఇక బర్త్డే ఏర్పాట్లను సత్య దగ్గరుండి చూసుకుంటుంది. లోపల అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే క్రిష్ వచ్చి ఏమైంది ఎవరి కోసం వెతుకుతున్నావంటే సంధ్య ఎక్కడ కనిపించట్లేదు అనేసి అడుగుతుంది..సంధ్య ఏమైనా చిన్నపిల్లనా ఎక్కడికి పోతుంది వస్తుందిలే అనేసి అరుస్తాడు. ఇక బయట అంతా బర్త్డే ఏర్పాట్లను చూస్తూ ఉంటారు.
అందరూ అక్కడికి వస్తారు. క్రిష్ రాగానే నా డ్రెస్ ఎలా ఉంది బాపు అని అడుగుతాడు. చాలా బాగుందిరా క్రిష్ గాడు సెలక్షన్స్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు అనేసి అంటాడు ఇక భైరవి కూడా క్రిష్ సెలక్షన్లో డౌటే లేదు అన్నట్టు చెప్తుంది.. ఇక రేణుక కూడా నా మరిది సెలక్షన్ ఎలా ఉంటుందో సత్య అంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది అనేసి అంటుంది. ఇదంతా కాదు నేను అసలు నిజం చెప్పాలి ఈ డ్రెస్ ని సెలెక్ట్ చేసింది నీ చిన్న కోడలే అనేసి మహాదేవయ్యతో అంటాడు. నా చిన్న కోడలు ఏదైనా గాని మొగుడు గురించి బాగా ఆలోచిస్తుంది అందుకే ఇంత బాగా సెలెక్ట్ చేసిందనేసి మహదేవయ్య సత్యను మెచ్చుకుంటాడు. ఇక అప్పుడే చక్రవర్తి అక్కడికి వస్తాడు. సారీ రా నువ్వు పిలవకపోయినా నేను వచ్చేసాను ఏమనుకోవద్దు అనేసి అనగానే, తన కొడుకు కోసం వచ్చాడని సత్య అంటుంది. సంజయ్ తన కొడుకే కదా సంజయ్ బర్త్డే కూడా ఇవ్వాలి కదా అందుకే తన బర్త్డేకి వచ్చారని సత్య కవర్ చేస్తుంది.
నేను పిలవకపోయినా నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను బాబాయ్ అనేసి క్రిష్ బాబాయ్ తో సరదాగా ఉంటాడు. ఇక వీరిద్దరిని చూసి మహదేవయ్యా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసిన సత్యా దగ్గరికి వెళ్లి ఇక్కడ ఏదేదో జరిగిపోతుంది తేడాగా జరుగుతుంది ఏంటి మావయ్య అనేసి అడుగుతుంది. అందరూ వచ్చారు కానీ సంజయ్ ఇంకా రాలేదనేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.
ఇక జయమ్మ నేను వెళ్లి పీల్చుకొని వస్తానంటే లేదు నేను వెళ్లి పిలుచుకుని వస్తానని సత్య వెళ్తుంది.. లోపల సంధ్య సంజయ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. సత్య వచ్చి డోర్ కొడుతుంది. సంజయ్ టెన్షన్ పడుతూ డోర్ తీయగానే ఏంటి అంటే అందరూ కింద నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నావ్ కిందకి రావాలి కేక్ కట్ చేయాలి అనేసి అంటుంది. రూమ్ లో ఎవరైనా ఉన్నారా అని తొంగి చూస్తుంది కానీ ఎవరు కనిపించరు. ఇది బ్యాచిలర్స్ రూమ్ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు రావడానికి బాగోదు అనేసి సంజయ్ సత్యతో అంటాడు. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా అనేసి అడుగుతుంది సత్య.. సంధ్య ఫోను రింగ్ అవుతుంది. ఫోన్ ఎవరిది అనగానే అది కూడా నా ఫోనే కావాలంటే రింగ్ ఇస్తాను అని కవర్ చేస్తాడు. సంజయ్ కోసం వెళ్ళిన నీ పెళ్ళాం సత్య ఇంకా రాలేదేంటి అనేసి జయం అంటుంది అప్పుడే సత్యా సంజయ్ అక్కడికి వస్తారు. ఇక సంజయ్ రాగానే చక్రవర్తి రావడం చూసి హాయ్ డాడ్ అనేసి అంటాడు. చక్రవర్తి హ్యాపీ బర్త్డే ని విష్ చేస్తాడు. కేక్ కట్ చేయడం అలాంటి సెంటిమెంట్స్ ఏవి లేవు నువ్వే కట్ చెయ్ బ్రో రెండు కేకులు అనేసి సంజయ్ అంటాడు.
అదేం లేదు ఇద్దరం కట్ చేద్దామనేసి క్రిష్ అనగానే ఇద్దరు కేక్ కట్ చేస్తారు. మహాదేవయ్య అనుకోని చక్రవర్తి వైపు క్రిష్ తిరుగుతాడు. ఇక సత్య కేకల తీయడానికి కుదరదు ఎవరివైతే తిరిగావో వారికే కేక్ పెట్టాలి అంటే నువ్వు మీ బాబాయికి కేక్ పెట్టాలి అనేసి అంటుంది.. ఇక క్రిష్ అందరి మాట విని బాబాయ్ కి కేక్ పెడతాడు. ఇక సంజయ్ నువ్వు మా డాడీకి కేకు పెట్టావు నేను మీ డాడీకి పెడతాను అనేసి అంటాడు. ఇదంతా చూసిన భైరవి ఏంటి గందరగోళం అనేసి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..