Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ ఫ్రెష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక చివరిగా ఈమె బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “సికిందర్” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక త్వరలోనే కుబేర సినిమా(Kubera Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush), రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Nagarjuna) కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హీరో ధనుష్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ధనుష్ మాట్లాడుతూ తనకు హిందీ రాదని ఇంగ్లీష్ లోనే మాట్లాడుతానని చెప్పుకు వచ్చారు.
6గంటలు చెత్తలోనే…
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో తాము ఒక సన్నివేశాన్ని డంప్ యార్డ్ లో చేయాల్సి వచ్చిందని తెలిపారు. దాదాపు 6 గంటల పాటు అక్కడే ఉండి షూటింగ్ చేశామని తెలిపారు. ఇలా గంటలు తరబడి అక్కడే ఉండటం వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. మాస్క్ వేసుకొని ఉన్నప్పటికీ అక్కడ ఉండలేకపోయాను,కానీ రష్మిక మాత్రం డంప్ యార్డ్ లో బాగా ఎంజాయ్ చేసిందని తెలిపారు. అక్కడ స్మెల్ భరించలేకపోతుంటే తను మాత్రం నాకు ఎలాంటి వాసన రాలేదు సర్ అంటూ సింపుల్గా సమాధానం చెప్పిందని ధనుష్ తెలిపారు.
థర్డ్ సింగిల్…
ఇలా ఏకంగా 6 గంటల పాటు ఎలాంటి మాస్క్ లేకుండా రష్మిక అక్కడ ఉండి ఎంజాయ్ చేసిందని ధనుష్ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఇదే విషయం గురించి ధనుష్ మాట్లాడుతూ.. భగవంతుడి దయవల్ల నేను చిన్నప్పటి నుంచి చాలా కంఫర్ట్ జోన్ లోనే పెరిగానని, చిన్నప్పటినుంచి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను. కానీ మనకు తెలియని ప్రపంచం మరొకటి కూడా ఉందని, ఆ ప్రపంచాన్ని నేను ఇలా చూశానని తెలిపారు. ఇలా ఒక సినిమా షూటింగ్ కోసం నటీనటులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ డంప్ యార్డ్ సన్నివేశాలు తీసేటప్పుడు తాను ఇబ్బంది పడిన, రష్మిక మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక పక్కనే ఉన్న రష్మిక మాత్రం ధనుష్ మాటలకు నవ్వుతూ అలా ఉండిపోయింది. ఇక ఈ సినిమా జూన్ 20వ తేదీ హిందీ, తమిళ ,తెలుగు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.