BigTV English

Janhvi Kapoor in Peddi : జాన్వీ పై ఉన్న బూతు ముద్రని బుచ్చిబాబు పోగొడతాడా?

Janhvi Kapoor in Peddi : జాన్వీ పై ఉన్న బూతు ముద్రని బుచ్చిబాబు పోగొడతాడా?

Janhvi Kapoor in Peddi : శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ‘ధఢక్’ అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. మొదటి సినిమాలో ఆమె నటనతో మెప్పించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో కూడా కదిలించింది. మొత్తానికి మొదటి సినిమాతో జాన్వీ పాస్ మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ ‘రూహి’ ‘గుడ్ లక్ జెర్రీ’ ‘మిలి’ ‘బావాల్’ ‘రాకీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ’ ‘తేరి బెతూన్ మెయిన్ ఐసా ఉల్జా జియా’ ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ ‘ఉలాజ్’ వంటి సినిమాల్లో నటించింది.


కానీ అవేవీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందువల్ల జాన్వీ అక్కడ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. దీంతో మెల్లగా ఆమె తెలుగు పై ఫోకస్ పెట్టింది. ఓ దశలో పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమాలో ఈమెను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు. లుక్ టెస్ట్ వంటివి కూడా నిర్వహించారు. కానీ ఎందుకో ఆమె ‘లైగర్’ లో ఆమె భాగం కాలేకపోయింది. ఒక రకంగా అది ఆమె మంచికే జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ‘లైగర్’ పెద్ద ప్లాప్ అయ్యింది కాబట్టి..! అటు తర్వాత కూడా ఒకటి, రెండు తెలుగు సినిమాలకి జాన్వీ కపూర్ ని సంప్రదించారు. కానీ అవి కూడా సెట్ అవ్వలేదు.

మొత్తానికి ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన ‘దేవర’తో జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయ్యింది. ఇందులో తంగం అనే పాత్రలో ఆమె నటించింది. వాస్తవానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. కానీ జాన్వీ కపూర్ ఈ సినిమాతో నటిగా ప్రేక్షకులను అలరించింది లేదు. గ్లామర్ కి మాత్రమే పరిమితమైంది. స్క్రీన్ స్పేస్ విషయంలో కూడా జాన్వీ కేర్ తీసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో ఆమె కనిపించదు. సెకండ్ హాఫ్ లో వస్తుంది.


ఆమె పాత్ర మొత్తం గ్లామర్ వలకబోయడానికే అన్నట్టు ఉంటుంది. ఆమె సంభాషణల్లో కూడా చాలా వల్గారిటీ ఉంటుంది. ఓ సీన్లో అయితే తంగం తన ఫ్రెండ్స్ తో కలిసి పెట్టే డిస్కషన్స్ లో కూడా చాలా డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. ‘చుట్టమల్లే’ సాంగ్లో ఆమె గ్లామర్ గురించి.. హీరోతో రొమాన్స్ గురించి ఇక చెప్పనవసరం లేదు. సినిమా ప్రమోషన్స్ లో 2 పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో జాన్వీ చెప్పేసింది అని చెప్పారు. కానీ సినిమాలో ‘ఉందే వాడిలో..’ ‘వాడిలో లేదే..’ వంటి డైలాగులు తప్ప ఏమీ లేవు. అలా ‘దేవర’ సినిమాతో జాన్వీ పై బూతు ముద్ర పడింది.

ప్రస్తుతం ఆమె రాంచరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇందులో కూడా ఆమె గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఇందులో జాన్వీ పాత్ర చాలా బాగా డిజైన్ చేశారట. ఇందులో ఆమె అసలైన నటిని చూస్తారని టీం చెబుతుంది.శ్రీదేవి కూతురి నుండి తెలుగు ప్రేక్షకులు ఆశించే నటనని ఇందులో జాన్వీ కనపరుస్తుంది అని ధీమాగా చెబుతున్నారు. అప్పుడు ఈమెపై ఉన్న బూతు ముద్ర పోయినట్టే..!

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×