Kubera Pre Release Event: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలోనే కుబేర సినిమా(Kubera Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 20వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో నేడు హైదరాబాదులో ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.
బెగ్గర్ పాత్రలో ధనుష్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఇక ఇందులో ధనుష్ ఒక బెగ్గర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో భాగంగా నాగార్జున కూడా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన సుమ ప్రతి ఒక్కరిని కొన్ని రకాల ప్రశ్నలు వేస్తూ వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు.
ధనుష్ మల్టీ టాలెంటెడ్..
రాజమౌళి దగ్గరికి వెళ్లి ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే రష్మిక వద్దకు వెళ్లి ఈ హీరోల నుంచి మీరు ఏదైనా కాపీ చేయాలనుకుంటే ఏ క్వాలిటీస్ కాపీ చేస్తారు అంటూ ఆమె ప్రశ్న వేశారు. ఇలా సుమ నాగార్జున పేరు చెప్పగానే వెంటనే రష్మిక నాగార్జున నుంచి తన ఆకర్షణ, ఆరా కాపీ చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. అలాగే ధనుష్ నుంచి ఏ క్వాలిటీ కాపీ చేయాలనుకుంటున్నారు అని రష్మికను ప్రశ్నించారు. ఇక ధనుష్ గురించి రష్మిక మాట్లాడుతూ… ధనుష్ గారు ఏదైనా చేయగలరు ఆయన సినిమాలు చేయగలరు, డైరెక్షన్, మ్యూజిక్ ,సింగింగ్ ఇలా ప్రతి ఒక్కటి చేస్తారని ఈక్వాలిటీస్ అన్ని కాపీ కొట్టేస్తానని తెలిపారు.
విజయ్ నుంచి అన్ని కావాలి…
ఇకపోతే సుమ తదుపరి అల్లు అర్జున్ పేరు చెప్పారు.. అల్లు అర్జున్ నుంచి ఆయన స్వాగ్ కాఫీ చేస్తానని తెలియజేశారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే చివరిగా సుమ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)పేరు చెప్పారు. ఇలా విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం కేరింతలతో మారుమోగిపోయింది. ఇక రష్మిక కూడా విజయ్ పేరు వినగానే మెలికలు తిరిగిపోయింది. విజయ్ దేవరకొండ నుంచి ప్రతి ఒక్కటి నేను కాపీ చేయాలనుకుంటానని ఆయన నుంచి అన్ని తీసేసుకుంటాను అంటూ చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతి త్వరలోనే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. పలు సందర్భాలలో రష్మిక తమ ప్రేమ విషయం గురించి పరోక్షంగా తెలియజేస్తూనే వస్తున్నారు. తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.