BigTV English

Kubera Trailer: డబ్బు, పవరే పని చేస్తుంది.. నీతి న్యాయం కాదు… అదిరిపోయిన కుబేర ట్రైలర్!

Kubera Trailer: డబ్బు, పవరే పని చేస్తుంది.. నీతి న్యాయం కాదు… అదిరిపోయిన కుబేర ట్రైలర్!

Kubera Trailer: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన కుబేర సినిమా(Kubera Movie) నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) వచ్చారు ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందనే సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ ట్రైలర్ లో కూడా అనుకున్న విధంగానే మనుషులు బంధాలు డబ్బు అనే కోణంలోనే ట్రైలర్ కట్ చేశారు.


నీతి న్యాయం పనిచేయవు…

సుమారు 2 నిమిషాల 39 సెకండ్ల నిడివి ఉన్నటువంటి ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకునే విధంగానే ఉంది ఈ ట్రైలర్ మొదట్లోనే ధనుష్ కోట్లు కోట్లు అంటే ఎంత సార్ అనే డైలాగుతో ప్రారంభమవుతుంది. అదేవిధంగా నాగార్జున ఈ దేశంలో డబ్బు పవర్ మాత్రమే పనిచేస్తాయి.. నీతి న్యాయం పనిచేయవు అంటూ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ ట్రైలర్లో నాగార్జున చెప్పే డైలాగ్స్ వింటుంటే మాత్రం ఈయన ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ట్రైలర్ మొత్తం డబ్బు అధికారులు భావోద్వేగాల మధ్య కొనసాగుతుంది.


డబ్బే మూలం…

ఇక ఈ సినిమాలో రష్మిక(Rashmika) పాత్రకు కూడా మంచి హైప్ ఉందని ట్రైలర్ ద్వారానే తెలుస్తుంది. ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక బిచ్చగాడికి ధనవంతుడికి మధ్య జరిగే ఘర్షణల కనిపిస్తోంది.. మొత్తానికి విభిన్నమైన సరికొత్త కథతో శేఖర్ కమ్ముల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా జూన్ 20వ తేదీ తెలుగు, హిందీ, తమిళ, భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ పూర్తిస్థాయి తెలుగు సినిమా కుబేరలో నటించారు. ఇక ఇందులో ధనుష్(Danush) ఒక బెగ్గర్ పాత్రలో కనిపించబోతున్నారు అని తెలుస్తుంది.

ఎప్పుడు విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం సరికొత్త జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. మరి జూన్ 20 వ తేదీ రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ధనుష్ కోలీవుడ్ హీరో అప్పటికి ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈయన సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ వస్తున్న నేపథ్యంలో ధనుష్ పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీ అవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×