BigTV English

Anshu Reddy: స్వచ్ఛమైన ప్రేమ కావాలంటున్న సీరియల్ నటి.. ఈ కాలంలో అదెక్కడమ్మా..?

Anshu Reddy: స్వచ్ఛమైన ప్రేమ కావాలంటున్న సీరియల్ నటి.. ఈ కాలంలో అదెక్కడమ్మా..?

Anshu Reddy : మేఘమాల సీరియల్ ద్వార తెలుగు తెరకు పరిచయమైన నటి అన్షు రెడ్డి. తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించింది. ఈమె తెలుగు, తమిళ సీరియల్స్ లో నటించారు. ఈమె చిన్నతనం నుంచి నటనపై మక్కువతో బుల్లితెరపై అడుగు పెట్టారు. మేఘమాల సీరియల్ తర్వాత భార్యామణి సీరియల్ లో నటించారు. తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈమె మాటీవీలో వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో అన్షు బాగా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఏముందో ఇప్పుడు చూద్దాం..


ఈ రోజుల్లో..కష్టమే ..

తెలుగు తమిళ సీరియల్స్ లో తనదైన నటనతో మెప్పిస్తున్న అన్షు రెడ్డి. ఈమె గతంలో సౌమిత్ రెడ్డి అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి అనుకోని కారణాలతో, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె కెరియర్ పైనే దృష్టి పెట్టారు. వరుసగా సీరియస్ లో నటిస్తూ, టీవీ ప్రోగ్రామ్స్ లోను సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఈమె పెట్టిన పోస్ట్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అన్షు రెడ్డి, ప్రతి ఒక్కరు నా లైఫ్ నుండి రిజెక్ట్ చేసిన తరువాత, నా జీవితం లో ప్రేమా లేదు.. ఎవరూ లేరు.. స్వచ్ఛమైన ప్రేమ కావాలి అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన వారంతా, ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం కొంచెం కష్టమే అని, అసలు స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


కోడలు అంటే ..ఇలానే వుండాలి 

ఇక ఈమె సీరియల్స్ విషయానికి వస్తే.. గతం లో ఈమె చేసిన సీరియల్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గోకులంలో సీత, ఇద్దరమ్మాయిలతో, సూర్యవంశం, కథలో రాజకుమారి వంటి సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ లో, రామరాజు రెండో కోడలిగా నర్మదా అనే క్యారెక్టర్ లో నటిస్తున్నారు. కోడలు అంటే ఇలానే ఉండాలి అనేటటువంటి అద్భుతమైన పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇప్పటికే ఈమె 15 సీరియల్ పైగా నటించారు. ఈమె టీవీ ప్రోగ్రామ్స్ లోను సందడి చేస్తున్నారు. ఈమె నటిస్తున్న ప్రస్తుత సీరియల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ లో ప్రభాకర్, ఆమని మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు.

తమిళ సీరియల్ రాజారాణి, గోపురంగల్ సీరియల్స్ ద్వారా ఈమె తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక సీరియల్స్ తో పాటు భలే ఛాన్స్లే ఆదివారం స్టార్ మా పరివారం, వంటి ప్రోగ్రామ్స్ లలో సందడి చేస్తుంటారు అన్షు రెడ్డి. ఈమె యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. అందులో తన రోజువారి జీవనశైలి, షాపింగ్, మేకప్ ట్రావెల్ కు సంబంధించిన అనుభవాలను ఆ చానల్లో పంచుకుంటారు. గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు సినిమాలు, సీరియల్స్ లో స్థానికంగా తెలుగు వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా అన్షు రెడ్డి  మరిన్ని సీరియల్స్ లో నటించాలని మనము కోరుకుందాం ..

https://www.instagram.com/stories/_anshureddy/3621341617245885188?utm_source=ig_story_item_share&igsh=aWY4Ync3am83dHlq

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×