Ravi Kishan : ప్రముఖ నటుడు రవి కిషన్ (Ravi Kishan) ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తరచుగా తన స్టేట్మెంట్స్ తో వార్తల్లో నిలిచే ఆయన తాజాగా మరోసారి శివుడి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా భారతదేశం శివ నామస్మరణతో మార్మోగిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రవి కిషన్ తాను మహా శివుడిని ప్రత్యక్షంగా చూసానంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మహా శివుడి ప్రత్యక్ష దర్శనం
రవి కిషన్ (Ravi Kishan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనని “ఎప్పుడైనా మహాశివుడిని చూశారా?” అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు రవికిషన్ స్పందిస్తూ “నేను మనోజ్ బాజ్‌పేయి, మానవ్ కౌల్, పీయూష్ మిశ్రాతో 1971 షూటింగ్ చేస్తున్నప్పుడు చూశాను. మేమంతా ఆ సమయంలో మనాలిలో ఉన్నాము. అక్కడ సినిమా షూటింగ్ చేశాం. రాత్రంతా షూట్ చేశాం. అలాగే షూటింగ్ ను ఉదయం వరకూ కొనసాగించాం. దీంతో మేము సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో ఆ పర్వతాలలో మా చుట్టూ మంచు ఉంది” అని అన్నారు.
మనాలి పర్వతాలపై మహా శివుడు…
రవి కిషన్ (Ravi Kishan) మాట్లాడుతూ “ఓ షాట్‌లో తల పైకెత్తి చూసేసరికి మహా శివుడి దర్శన భాగ్యం కలిగింది. నేను పర్వతాల వైపు చూసినప్పుడు శివుడు పర్వతాలలో నడుస్తూ కనిపించాడు. ఆయన రూపం చాలా పెద్దగా ఉంది. మనోజ్ బాజ్‌పేయి నా పక్కనే ఉన్నాడు. దీపక్ డోబ్రియాల్ కూడా ఉన్నారు. వారిని కూడా చూడమని అడిగాను. మనోజ్ అతన్ని చూశాడో లేదో నాకు తెలియదు. లేదంటే నేను ఇంకేదైనా చూస్తున్నానని ఆయన అనుకుని ఉండొచ్చు” అని అతను చెప్పాడు. ఆ క్షణంలో తను శివుడిని చూసానని ఇప్పటికీ నమ్ముతున్నానని చెప్పారు రవి కిషన్. దీంతో రవికిషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రవి కిషన్ ఇప్పటికే అనేక భారతీయ భారతీయ భాషలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పటిదాకా ఆయన ఏకంగా 700 సినిమాలో నటించారు. ఇక తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ సినిమాలో మద్దాలి శివారెడ్డి అనే విలన్ పాత్రను పోషించి పాపులర్ అయ్యాడు. సినిమాలలు మాత్రమే కాదు ఆయన రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటారు.
గోరఖ్‌పూర్ నుండి ఎంపీ అయిన రవి కిషన్ కు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇటీవలి ఇంటర్వ్యూలో రవి తనను తాను పూర్తిగా శివునికి అంకితం చేశానని, పర్వతాలలో దేవుడు నడయాడడాన్ని చూశానని పేర్కొనడమే అందుకు నిదర్శనం. ఇక ఆయన చేసే కామెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రీసెంట్ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అని రవి కిషన్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే, అదే జరుగుతుందని ఈ యాక్టర్ బలంగా నమ్ముతాడు.