Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత(Samantha).. గత రెండు సంవత్సరాల నుండి ఆ పని చేస్తోందట. ఆ పని కారణంగా తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని కూడా చెబుతోంది. అంతేకాదు తాను చేస్తున్న పని అందరినీ చేయమని కూడా సలహాలిస్తోంది. మరి ఇంతకీ సమంత చేస్తున్న ఆ పని ఏంటి..? సమంతకి గేమ్ ఛేంజర్ గా మారిన ఆ సంథింగ్ స్పెషల్ విషయం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)తో విడాకుల తర్వాత సమంత ఎంతో కృంగిపోయింది. డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది.దాని నుండి బయటపడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. ఎన్ని సినిమాల్లో నటించినా కూడా తనకి ఆ డిప్రెషన్ నుండి బయట పడేంత శక్తి రాలేదని చెప్పుకోవచ్చు.
కష్టాల కడలి దాటుతున్న సమంత..
ముఖ్యంగా విడాకుల తర్వాత సమంతని సోషల్ మీడియా మొత్తం టార్గెట్ చేసింది.ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ విడాకులకు కారణం సమంతనే అన్నట్లుగా ఆమెపై నిందలు వేశారు. అవి తట్టుకోలేక సమంత పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఇక ఈ మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డాక సమంత ఎలా తయారయ్యిందో చెప్పనక్కర్లేదు.ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఉన్న సమంతకి ఇప్పుడు ఉన్న సమంత కి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో చెప్పనక్కర్లేదు.అలా ఎంతో అందంగా ఉండే సమంత మయాసైటిస్ కారణంగా గుర్తుపట్టలేని విధంగా తయారయింది. అయితే ఇప్పుడిప్పుడే అన్నింటి నుండి కోలుకొని మళ్ళీ లైఫ్ లో చాలా స్ట్రాంగ్ గా మారాలని ఎన్నో స్ట్రాంగ్ డెసిషన్లు తీసుకుంటుంది. అయితే అలాంటి సమంత గత రెండు సంవత్సరాలు నుండి ఒక పని చేస్తుందట. ఆ పని ఏంటంటే.. “వెల్ నెస్ డైరీ”..
జీవితంలో ఒక భాగం అయిపోయింది..
ఇక దీని గురించి అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తాను ప్రతిరోజు చేసే విషయాలన్ని ఆ డైరీలో రాసుకుంటుందట. అది చాలా చిన్న విషయం అయినా సరే ఆ డైరీలో కచ్చితంగా ఆ పాయింట్ ఉండాల్సిందేనట.. ఎవరికి థాంక్స్ చెప్పాలి.. ఎందుకు చెప్పాలి.. ఆ రోజు ఎందుకు గ్రేట్ ? అనేది కచ్చితంగా ఆ డైరీ లో రాసుకుంటుందట.ఇక వెల్ నెస్ డైరీ తన లైఫ్ లో ఒక భాగం అయిపోయిందని,ఇదే తన లైఫ్ గేమ్ ఛేంజర్ అంటూ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. అంతేకాదు మొదట్లో వెల్ నెస్ డైరీ రాయడానికి తనకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేదని,అసలు ఏం రాయాలి..? ఎలా రాయాలి..?ఏ విషయాలు రాయాలి? అనేది కూడా తెలియకపోయేదని,కానీ మెల్లిమెల్లిగా అలవాటైపోయి ఇప్పుడు పూర్తిగా దానికి ఆడిక్ట్ అయినట్లు, ప్రతిరోజు వెల్ నెస్ డైరీ రాస్తున్నానని, అలాగే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది రాయడం మరింత సులభం అవుతుంది అని,ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేసి మీరు కూడా ఇలా ప్రతిరోజు వెల్ నెస్ డైరీ రాసుకోండి అంటూ సమంత సలహాలు ఇస్తుంది. అంతేకాదు గత రెండేళ్ల నుంచి తన లైఫ్ లో ఎన్నో మార్పులు వచ్చాయని,ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదని తెలిపింది. అంతేకాదు దీన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తే ఎవరి లైఫ్ లో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం” అంటూ సమంత ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ చాలా మందిని ఆకర్షిస్తోంది.
సమంతను స్ట్రాంగ్ గా మార్చిన డైరీ..
అంతేకాదు సమంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఇలా నిలబడడానికి కారణం ఈ డైరీ ఓ కారణమైంది కావచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సమంత అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘రక్త బ్రాహ్మండ్’ అనే వెబ్ సిరీస్ తో పాటు తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తోంది.