Ravi Teja: ప్రస్తుతం సీనియర్ హీరోలు చాలావరకు ఒకే ఫార్మాట్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులు బోర్ అయిపోయేలా చేస్తున్నారు. అందుకే చాలావరకు వారికి హిట్స్ అందడం లేదు. పైగా గత కొన్నేళ్లలో కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది. దానివల్లే సీనియర్ హీరోలు సైతం డిఫరెంట్ స్క్రిప్ట్స్ కోసం వెతుకుతున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా అదే పని చేయాలి అంటూ ప్రేక్షకులు సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. అవేమీ పట్టించుకోకుండా మరొక కమర్షియల్ మూవీతోనే ప్రేక్షకులను ఎలాగైనా ఎంటర్‌టైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు రవితేజ. అదే ‘మాస్ జాతర’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఇదేనంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
మొదటి పాట వచ్చేస్తోంది
రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన ‘మాస్ జాతర’ సినిమా సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలు సినిమా విడుదల మాత్రమే కాదు.. దీని నుండి అప్డేట్స్ రావడం కూడా ఆగిపోయింది. అప్పుడప్పుడు మూవీకి సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు తప్పా అంతకు మించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు మేకర్స్. ఇక ఫైనల్‌గా ‘మాస్ జాతర’కు అప్డేట్స్ ఇచ్చే సమయం వచ్చిందని మేకర్స్ ఫీల్ అయినట్టు ఉన్నారు. అందుకే మొదటి పాటకు సంబంధించిన అప్డేట్‌ను విడుదల చేశఆరు. ‘తూ మేరా లవర్’ అంటూ సాగే పాట విడకుదల ముహూర్తం ఫిక్స్ చేశారు. ఒక స్పెషల్ పోస్టర్‌తో దీని గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
విడుదల ఎప్పుడంటే.?
‘మాస్ జాతర’ (Mass Jathara) నుండి ‘తూ మేరా లవర్’ పాట ఏప్రిల్ 14న విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ఒక ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ లేట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో చాలావరకు ఆసక్తి తగ్గిపోయింది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇవి కొంతవరకు హెల్ప్ అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాకపోతే ‘మాస్ జాతర’ను ప్రేక్షకులు మర్చిపోతారు అని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: త్రివిక్రమ్ అయినా సరే.. ఈయన కండీషన్స్‌కు ఒప్పుకోవాల్సిందే..
ఇలాంటివి వద్దు
రవితేజ చివరిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో నటించాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘రెయిడ్’ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. రీమేక్స్‌లను తెరకెక్కించడంలో హరీష్ శంకర్ స్పెషలిస్ట్ కాబట్టి ఈ మూవీ హిట్ అవుతుందని చాలామంది ఫ్యాన్స్ నమ్మారు. పైగా మూవీ టీమ్ సైతం దీని సక్సెస్‌పై నమ్మకం వ్యక్తం చేశారు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ డిశాస్టర్ అయ్యింది. దీంతో రవితేజ పద్ధతి మార్చాలని, ఇలాంటి కమర్షియల్ సినిమాలు చేయడం ఆపేయాలని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అప్పటికే తను భాను బోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమాను కన్ఫర్మ్ చేసేశాడు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
This is going to be something very special for us all 🤗🤗🤗#MassJathara First Single #TuMeraLover on April 14th! pic.twitter.com/Mcw3y6bNHw
— Ravi Teja (@RaviTeja_offl) April 10, 2025