Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే జాబితాను రెడీ చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. జాబితాను హైకమాండ్‌కు ఇచ్చేందుకు పార్టీలోని కీలక నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
హైకమాండ్‌కు జాబితా
అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌తోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్‌తో ఏఐసీసీ పెద్దలు మాట్లాడినట్టు సమాచారం. ఎమ్మెల్సీల జాబితాను కాసేపట్లో అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ ఇవ్వనున్నారు. నాలుగు స్థానాల్లో సీపీఐకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన మూడు సీట్లలో సామాజిక సమీకరణాల కూర్పు జరుగుతోంది.
వారికే తొలుత ఛాన్స్
బీసీ లేదంటే ఓసీకి ఒకటి ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెరో ఒకటి ఇస్తారన్నది గాంధీభవన్ వర్గాల మాట. ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ రేసులో ఉన్నారు. ఓసీ నుంచి జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇన్‌ఛార్జ్ కుమార్ రావు , ఇక ఎస్టీ నుంచి శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
హైకమాండ్ మనసులోని మాట
గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఉన్నవారికి అవకాశాలు దక్కడం కష్టమని అంటున్నాయి. ఎందుకంటే ఈ విషయం ఏఐసీసీ పెద్దలు అందరికీ న్యాయం చేయాలని అంటున్నారట. ఒక్కో సీటుకు నాలుగు లేదా ఐదుగురు చొప్పున 20 మంది పోటీపడ్డారు. అయితే హైకమాండ్ ఇచ్చిన సలహాలు పలుమార్లు కూర్పు చేశారు.
ALSO READ: టన్నెల్ రెస్క్యూలో పురోగతి
చివరకు సీపీఐకి ఒకటి పోగా, కేవలం మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తానికి ఈ సారి ఛాన్స్ రానివారికి మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేదంటే కార్పొరేషన్ ఛైర్మన్లు, లేదంటే పార్టీ పదవులు అప్పగిస్తారని అంటున్నారు. మొత్తానికి మూడు సీట్లకు అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారంగా మారిందనే చెప్పవచ్చు.
కొలిక్కి వస్తున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడిన ఏఐసీసీ పెద్దలు
ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్… pic.twitter.com/SHH6MbJSSb
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025