Razakar..అనసూయ (Anasuya).. ఒకప్పుడు న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత జబర్దస్త్ (Jabardast) లోకి యాంకర్ గా అడుగుపెట్టింది అనసూయ. అక్కడ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అలా 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా షోలో సందడి చేసిన అనసూయ అనూహ్యంగా షోలో బాడీ షేమింగ్ కామెంట్లు చేసి షో నుంచి తప్పుకుంది. ఆ సమయంలో అనసూయ విమర్శలు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.అంతే కాదు తన పాత్రలతో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా మంచి పేరు దక్కించుకున్న ఈమె.. ఆ తర్వాత పుష్ప, పుష్ప 2 సినిమాలతో దాక్షాయిణిగా మరో ముద్ర వేసుకుంది. ఇక అంతేకాదు ఇటీవల వచ్చిన ‘రజాకార్’ సినిమాతో మరో సంచలనం సృష్టించింది అనసూయ. ఏ స్టార్ హీరోయిన్ కూడా నటించని రేంజ్ లో నటించి అందరి చేత శభాష్ అనిపించింది. అయితే ఇప్పుడు ఈ రజాకార్ మూవీకి అవార్డులు లభించాయి.
అనసూయ రజాకార్ మూవీకి అవార్డులు..
నిరంకుశ నిజాం నవాబు తొత్తుల్లా వ్యవహరించిన రజాకర్ల ఆకృత్యాలను యాటా సత్యనారాయణ (Yata Sathya Narayana) వెండితెరపై రజాకార్ పేరుతో ఆవిష్కరించి.. నాటి విషయాలను నేటి యువతకి కూడా తెలిసేలా చేశారు. తెలంగాణ పల్లెల్లో రజాకార్లు చేసిన దారుణ మారణకాండకు ఈ సినిమా నిలువుటద్దంలా నిలిచింది. విడుదలకు ముందు పలు అడ్డంకులను ఎదుర్కొన్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల ఆదరణకు నేర్చుకుంది. అలాగే ఈ ఏడాది ఓటీటీలో విడుదలైనప్పుడు కూడా ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మక 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో రజాకార్ మూవీని ప్రదర్శించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన యాట సత్యనారాయణ నూతన దర్శకుడి కేటగిరీలో అవార్డుకు ఎంపిక కాగా, కుషేందర్ రమేష్ రెడ్డి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఎంపికయ్యారు. మొత్తానికి అయితే అనసూయ మూవీకి రెండు అవార్డులు లభించడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు.
సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్న బాబీ సింహ..
బాబీ సింహ, వేదిక, ప్రేమ, అనసూయ, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి రెండు అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను కీలక పాత్ర పోషించిన ఈ రజాకార్ మూవీకి అవార్డులు రావడం మరింత ఆనందంగా ఉందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు బాబీ సింహ. ఇక అనసూయ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో కీలకమైన పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు పలు షోలకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది. అంతేకాదు ఇటీవల ఫ్యాషన్ వీక్ లో కూడా పాల్గొన్న ఈమె అక్కడ తన అందాలతో అందరిని అబ్బురపరిచింది. ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో చెమటలు పట్టిస్తోంది అనసూయ.
ALSO READ:Allu Arjun : బన్నీ వైరల్ వీడియోలో ఇది గమనించారా… టీ షర్ట్ మాత్రం కాదండోయ్..!