Stampede at Shirgaon Jatra: గత కొద్ది రోజుల క్రితం సించాచలం అప్పన్న టెంపుల్ ఘటనలో.. ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.. ఇది మరువక ముందే గోవాలోని ఓ ఆలయంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీగావ్‌లోని శ్రీదేవి లైరాయ్ దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఆలయంలో జాతర జరుగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
గోవాలోని శిర్గాన్ దేవాలయంలో జాతర శుక్రవారం ప్రారంభం అయింది. ఈ జాతరలో పాల్గొనేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. కాగా శనివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. అయితే ఈ జాతరలో భక్తుల రద్దీ నేపథ్యంలో.. 1000 మందికి పైగా పోలీసులు, 100కి పైగా డ్రోన్లను ఉపయోగించారని అధికారులు తెలిపారు. అయినా కూడా తొక్కిసలాట జరగడం గమనార్హం.
తొక్కిసలాట ఘటన జరగకముందు కొద్దిసేపటి క్రితమే.. ముఖ్యమంత్రి ప్రమోద్, ఆయన భార్య సులక్షణ ఎంపీ సదానంద్ షెట్, పలువురు ఎమ్మెల్యేలు ఈ జాతరలో పాల్గొన్నారు. గోవాలోని శిర్గాన్ ఆలయం ఉత్తర, దక్షిణ నిర్మాణ శైలుల కలియికకు చాలా ప్రాముఖ్యత చెందింది. ప్రతి మే నెల తొలివారంలో ఈ జాతరను.. నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సాంప్రదాయ అగ్నిపై నడక ఆచారం కలిగి ఉన్న ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
గోవాలోని సమీప ప్రాంత ప్రజలు, గ్రామస్థులు తరుచూ ఈ ఆలయానికి వచ్చి.. లైరాయ్ దేవికి అంకితం చేసే మతపరమైన ఆచారాలను పాటిస్తుంటారు. ఇక ఈ జాతరలో అర్ధరాత్రి సమీపిస్తున్న సమయంలో భక్తులు ఆలయం లోపల నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. ఆ తర్వాత నృత్య సెషన్ల చివర్లో.. ఎంపిక చేసిన వ్యక్తి టెంపుల్ సమీపంలో భారీగా మంటలు వెలిగిస్తాడు. తెల్లవారుజామున మంటలు ఆరిన తర్వాత.. నిప్పులపై నడిచే ఆచారం ప్రారంభం అవుతుంది.
దేవి లైరాయ్ పేరును జపిస్తూ.. భక్తులందరూ బొగ్గుల గుండా పరుగెత్తుతారు. సూర్యోదయం మొదలవుతున్నప్పుడు ఈ జాతర ముగుస్తుంది. ఆ తర్వాత భక్తులు మర్రిచెట్టుకు పూలదండలు వేసి తిరగి ఇంటికి ప్రయాణమవుతారు.
Also Read: ఢిల్లీలో పకృతి ప్రకోపం.. భారీ వర్షానికి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఇదిలా ఉంటే.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం.. తీవ్రంగా వీచిన గాలులు.. అప్పుడే నిర్మించిన గోడ.. ఈ మూడు సింహాద్రి అప్పన్న స్వామి భక్తుల పాలిట శాపంగా మారాయి. ఏకంగా ఏడుగురి ప్రాణాలు తీశాయి. సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం జరుగుతోంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొందరు రాత్రి సమయంలోనే వచ్చి ఆలయంలో నిద్రించారు. అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారడం.. భారీ గాలులతో కూడిన వర్షం కురవడంతో అక్కడున్న గోడ కూలింది. పక్కనే ఉన్న భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురి ప్రాణాలు పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Goa Congress is deeply saddened by the stampede at Jatrotsav of Shree Lairai Devi,Shirgao. We condemn this tragic incident and offer heartfelt condolences to the families who lost their loved ones. Wishing a speedy recovery to all those injured. @DrAnjaliTai @ViriatoFern pic.twitter.com/Ut0Db1RZzs
— Goa Congress (@INCGoa) May 3, 2025