Thandel Pre Release Event : యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) భారీ అంచనాల మధ్య తాజాగా నటిస్తున్న చిత్రం తండేల్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రాబోతోంది. ఈ సినిమా కథను ఎంతో రీసర్చ్ చేసి.. రచయిత కార్తీక్ తీడా అందించారు. ఆయన ఈ చిత్రానికి శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీని ఆధారంగా చేసుకొని కథను రాసినట్లు తెలిసిన విషయమే. 2018లో జరిగిన వాస్తవిక సంఘటనను ఆధారంగా శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కార్తీక్ తీడా చాలా రీసెర్చ్ చేసాకే, ఈ కథను రాశారు. ముఖ్యంగా స్థానికంగా ఉండే జాలర్లతో ప్రయాణించి, వారి జీవనశైలినీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత సముద్రంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు, కస్టమ్స్ వారితో వాళ్ళకున్న కష్టాల గురించి నిశితంగా పరిశోధించి, రాజు, బుజ్జిల కథను అద్భుతంగా సినిమాటిక్ విజయంతో తీర్చిదిద్దడం జరిగింది.
నిజ జీవిత ఆధారంగా తండేల్..
ఇకపోతే నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన నేపథ్యంలో రియల్ తండేల్ కూడా తీసుకొస్తే బాగుంటుందని, వారెవరో చూడాలని అభిమానులు కూడా ఆసక్తి కనబరచగా.. నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిజమైన తండేల్ బుజ్జి తల్లిలను తీసుకొచ్చారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా రియల్ తండేల్ చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే.. మత్స్యకారులు గుజరాత్ వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని, అక్కడికి వెళ్లి చేపలు పట్టే క్రమంలో వారికి తెలియకుండానే పాకిస్తాన్ బోర్డర్ లైన్స్ లోకి వెళ్లిపోయారట. పాకిస్తాన్ ఆర్మీ వీరిని అరెస్టు చేశారట. దాదాపు అక్కడే 17 నెలలపాటు ఉండిపోయినట్లు తెలిపారు. ఇక అలా తమ నిజ జీవితంలో జరిగిన ఈ విషయాన్ని అందరికీ చెప్పడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. నిజమైన తండేల్, ఆయన సతీమణి తో పాటు పలువురు మత్స్యకారులు ఈ ఈవెంట్ కి రావడంతో.. ఈ ఈవెంట్ కి కొత్తదనం వచ్చిందని ఆడియన్స్ కూడా చెబుతున్నారు.
తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్..
రియల్ తండేల్ మాట్లాడుతూ.. “నా పేరు రామారావు.. ఇక్కడికి కేవలం ఒక ఏడు మంది మాత్రమే వచ్చాము. మిగతా వారంతా బ్రతుకుతెరువు కోసం వలస వెళ్లిపోయారు. కానీ మేము అలా వెళ్లలేక శ్రీకాకుళంలోనే ఉండిపోయాము. సినిమాలో చూపించబోతున్నట్టు హీరోయిన్ గర్భవతి అని చూపించారు కదా. అది నా భార్యే. మాకు పాప కూడా పుట్టేసింది అంటూ ఒక ఐదు సంవత్సరాల పాపని కూడా చూపించారు. ఇక తర్వాత 2018లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయిన రామారావు ఆ తర్వాత ఏదైనా ఒక సినిమాలో ఒక పాత్ర ఇస్తారని కోరుకుంటున్నాను అంటూ తన కోరికను బయటపెట్టారు. తండేల్ 2 వచ్చినా పర్వాలేదని రామారావు చెప్పగా.. ఇక ఆయన భార్య మాట్లాడుతూ.. తండేల్ 2 రావాలి అంటే మీరు మళ్లీ పాకిస్తాన్లో ఇరుక్కోవాలి అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి అయితే తనకు కూడా ఏదైనా అవకాశం ఇప్పించాలని కోరారు రియల్ తండేల్ రామారావు.