Prabhas:..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ (Prabhas) నాలుగు పదుల వయసు దాటినా సరే ఇంకా వివాహం చేసుకోలేదు. దీంతో ప్రభాస్ ఎప్పుడు వివాహం చేసుకుంటారా? అని అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రభాస్ తో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతోమంది హీరోలు వివాహం చేసుకొని.. పిల్లల్ని కని , వారిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే.. ప్రభాస్ మాత్రం ఇంకా సింగిల్గానే జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ విషయంపై అభిమానులు పూర్తిస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఊపందుకున్న ప్రభాస్ పెళ్లి వార్తలు..
ఇలాంటి సమయంలో అభిమానులను సంతోషపరచడానికి ప్రభాస్ పెళ్లిపై రోజుకొక వార్త చెక్కర్లు కొడుతోంది. గతంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) తో ఏడడుగులు వేయబోతున్నాడు అంటూ వార్తలు రాగా..ఆ వార్తలు కాస్త పుకార్లు గానే మిగిలిపోయాయి. ఆ తర్వాత అనుష్క శెట్టి(Anushka Shetty) తో ప్రేమలో పడ్డారని, వీరిద్దరి పెళ్లికి కృష్ణంరాజు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. కానీ వీరి పెళ్లి కూడా జరగలేదు. అటు కృష్ణంరాజు కూడా పరమపదించారు. దీనికి తోడు అటు అనుష్క శెట్టిపై కూడా పలు రకాల పెళ్లి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసింది. ముఖ్యంగా అటు త్రిష , ఇటు అనుష్క అలాగే ప్రభాస్ ముగ్గురు కూడా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ టీమ్..
ఇక ఇప్పుడు త్రిష విజయ్ దళపతి (Vijay Thalapathi) తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు రాగా.. మరొకవైపు అనుష్క శెట్టి కూడా బిజినెస్ మాన్ ను వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా హైదరాబాద్ కి చెందిన వేలకోట్ల ఆస్తికి అధిపతిరాలైన ఒక బడా బిజినెస్ మాన్ కూతుర్ని వివాహం చేసుకోబోతున్నారని, వీరి వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను దివంగత నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి (Shyamala devi) చేస్తున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. ఇక రెండు రోజుల నుంచి అటు జాతీయ మీడియాలో కూడా ప్రభాస్ పెళ్లి వార్తలు నడుస్తున్న నేపథ్యంలో ఈసారి ఈ విషయం సినీ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అందుకే ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించి, పుకార్లను ఖండించింది. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ పెళ్లి గురించి ఏదైనా వార్త ఉంటే నేరుగా తామే ప్రకటిస్తామని కూడా స్పష్టం చేసింది. మొత్తానికైతే ఈ విషయం విని అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.
ALSO READ;Rashmika Mandanna: ఆ గాయం ఇంకా మానలేదు.. రష్మిక ఎమోషనల్ కామెంట్..
ప్రభాస్ సినిమాలు..
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ‘రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు లైన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికైతే వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది.