Ragina Cassandra:..రెజీనా కసాండ్రా(Regina Cassandra) అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు సౌత్ లో స్టార్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ‘జాట్’ మూవీతో బాలీవుడ్ లో కూడా నిలదొక్కుకోవాలని చూస్తోంది.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో.. ఆ బాలీవుడ్ హీరోని చూస్తేనే భయమేసింది అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు,తమిళ,కన్నడ, హిందీ భాషల్లో నటిగా రాణిస్తున్న రెజీనా మొదటిసారి ‘శివ మనసులో శృతి'(SMS ) అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్తజంట’ వంటి సినిమాలతో టాలీవుడ్ టైర్ -2 హీరోలకు బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది. అలా ఈమె చేసిన సినిమాలు హిట్ అవ్వడంతో రెజీనాకి స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.
ఆయన్ని చూస్తే దేవుడే దిగి వచ్చాడనిపించింది – రెజీనా..
అయితే అలాంటి రెజీనా కసాండ్రా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్లో సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా చేస్తున్న ‘జాట్’ మూవీలో నటిస్తోంది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ సినిమాకి సంబంధించి పలు ఈవెంట్స్ లో పాల్గొంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతోంది. అలా తాజాగా నాకు ఆ హీరోని చూస్తే భయమేసింది అంటూ రెజినా మాట్లాడిన మాటలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.జాట్ మూవీ ఈవెంట్లో రెజీనా మాట్లాడుతూ.. ” జాట్ మూవీలో నా పాత్ర చాలా ప్రత్యేకం.అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు.స్క్రీన్ పైన చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అలాగే ఈ సినిమాలో సన్నీడియోల్ పాత్రను చూసి చాలా భయపడి పోయాను.ఒక దేవుడు దిగివస్తే, ఎలా ఉంటుందో అలా తన నట విశ్వరూపం చూపించారు. షూటింగ్ స్పాట్ లో ఆయన నటిస్తూ ఉంటే ఆయన నటన చూసి నేను షాక్ అయిపోయి, భయంలో మునిగి పోయాను. దగ్గరగా చూస్తే చాలా భయమేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన్ని చూడగానే వెన్నులో వణుకు పుట్టింది.. ఇక ఈ సినిమా గురించి,హీరో గురించి చెప్పడం కంటే చూస్తేనే మీరు బాగా కనెక్ట్ అవుతారు.అలాగే ఈ మూవీ బాలీవుడ్ లో నాకు ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నాను.అలాగే గోపీచంద్ మలినేనికి కూడా బాలీవుడ్ ఎంట్రీకి పర్ఫెక్ట్ మూవీ అని నా అభిప్రాయం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను”.. అంటూ తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో జాట్ మూవీ విశేషాలను పంచుకుంది రెజీనా.
ALSO READ; Vijay Deverakonda: ఆ డైరెక్టర్ వల్లే టాలీవుడ్ కి వెలుగొచ్చింది.. రౌడీ హీరో కామెంట్స్..!
రెజీనా కెరియర్..
రెజీనా కెరియర్ విషయానికి వస్తే..ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈ అమ్మడు.. ఎలాంటి పాత్రలోనైనా సరే తనదైన టాలెంట్ తో అదరగొడుతోంది. టాలీవుడ్లో యంగ్ హీరోలతో జోడి కట్టి మెప్పించిన ఈమె.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ.. పేరు దక్కించుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమాతో సక్సెస్ అవుతానని గట్టిగా చెబుతోంది. మరి ఈ సినిమాతో రెజీనా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.