SKN Controversy : ఇప్పటికే చిత్ర పరిశ్రమలో వరుస వివాదాలు నెలకొనగా, తాజాగా నిర్మాత ఎస్కేఎన్ (SKN) మరో కొత్త వివాదానికి తెర తీశారు. “తెలుగు హీరోయిన్లకు అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో అర్థమైంది, ఇకపై ఎంకరేజ్ చేయను” అంటూ ‘డ్రాగన్’ మూవీ ఈవెంట్ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి తెర తీశాయి. ఈ నేపథ్యంలోనే ఓ హీరోయిన్ తాజాగా నిర్మాత ఎస్కేఎన్ కు మిడిల్ ఫింగర్ అంటూ ఆయన పరువు తీసేసింది.
ఎస్కేన్ పై హీరోయిన్ ఫైర్
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వరు అన్న కంప్లైంట్ ఉండనే ఉంది. మరి కొన్నిసార్లు కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ తమను ట్రీట్ చేసిన విధానంపై ఓపెన్ గానే ఫైర్ అయ్యారు. మొత్తానికి తెలుగు హీరోయిన్లు టాలీవుడ్లో కన్నా ఇతర చిత్ర పరిశ్రమంలోనే ఎక్కువగా రాణించడం చూస్తున్నాము. ఇలాంటి టైంలో ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, కొత్త కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా మారారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ (Rekha Bhoj) ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ “ప్రతివాడు ఉద్ధరించేసినట్టుగా ఎదవ బిల్డప్… ఇప్పుడు ఏదో తెగ అవకాశాలు ఇచ్చేస్తున్నట్టు… ఇలా మాట్లాడటం అంటే తెలుగు అమ్మాయిలపై అఫీషియల్ గా బ్యాన్ అనౌన్స్ చేసినట్టే… మా బ్రతుకు తెరువు మీద కొట్టే విధంగా మాట్లాడిన మీకు ఏంట్రా గౌరవమిచ్చేది? పోరా… మిడిల్ ఫింగర్” అంటూ ఆయనను అవమానించే విధంగా తీవ్ర పదజాలంతో ఫైర్ అయింది. మరి ఆమె కామెంట్స్ పై ఎస్కేఎన్ స్పందిస్తాడా? ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
రష్మిక మందన్నపై ఎస్కేఎన్ స్పెషల్ పోస్ట్
ఓ వైపు ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతుంటే, మరోవైపు ఆయన ఈ వివాదాన్ని మరింత ముదిరే విధంగా ఓ పోస్ట్ చేశారు. అందులో ఎస్కేఎన్ రష్మిక (Rashmika Mandanna)ను క్వీన్ అంటూ పొగడడం విశేషం. ‘డ్రాగన్’ ఈవెంట్ లో తెలుగు అమ్మాయిలను అనౌన్స్ చేయను అని ప్రకటించిన తరువాత, ఎస్కేఎన్ నుంచి ఈ పోస్ట్ రావడం చర్చకు దారి తీసింది.
The queen 👑 @iamRashmika 💐 pic.twitter.com/LVzmj8yLQL
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 17, 2025
రేఖ భోజ్ ఎవరు ?
పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది తెలుగు హీరోయిన్ రేఖ. పలు సినిమాలో నటించినప్పటికీ ఈ అమ్మడికి బ్రేక్ ఇచ్చే ఆఫర్లు మాత్రం రాలేదు. దీంతో వైజాగ్ కి చెందిన ఈ అమ్మడు రెగ్యులర్ గా ప్రైవేట్ సాంగ్స్, సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్లతో వైరల్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా ఏపీలో జరిగిన ఎన్నికల్లో రేఖ బోజ్ జనసేన తరఫున ప్రచారం కూడా చేసింది. ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందనే టాక్ కూడా నడిచింది.