BigTV English

Renjusha Menon: అప్పుడు అపర్ణ ఇప్పుడు రెంజుషా.. తీవ్ర విషాదంలో సినీ ఇండస్ట్రీ..

Renjusha Menon: అప్పుడు అపర్ణ ఇప్పుడు రెంజుషా.. తీవ్ర విషాదంలో సినీ ఇండస్ట్రీ..

Renjusha Menon: ఈ రోజు సినీ పరిశ్రమలో మరో విషాద ఘట్టం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే భవిష్యత్తులో రాణిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ఒక తార ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణం అటు సినీ వర్గాన్ని కాకుండా ఇటు ఆమె బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మలయాళీ హీరోయిన్ ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు ,అభిమానులు దేవుని ప్రార్థిస్తున్నారు.


ఆ హీరోయిన్ ఎవరో కాదు రెంజుషా మీనన్. ఆమె తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించింది అన్న విషయాన్ని భర్త మనోజ్ మీడియా కు తెలియపరిచారు.అయితే ఇంకా ఆమె మరణం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె మరణానికి కేవలం ఆర్థిక ఇబ్బందులే కారణం అని మీడియా వర్గాల కథనం ప్రకారం అర్థమవుతుంది.

గత కొద్ది కాలంగా ఆమె ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు పడుతోంది. అయితే మరోపక్క ఈ ఒక్క సమస్యే ఆత్మహత్యకు కారణమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అసలు ఈమె మరణం నిజంగా ఆత్మహత్యనా? మరణం వెనుక ఏమన్నా కారణాలు ఉన్నాయా? ఆర్థిక సమస్యలే అసలు కారణమా? అనే కోణంలో కేరళ పోలీసులు తమ దర్యాప్తును చేపట్టారు. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.ప్రస్తుతం ఆమె దేహాన్ని పోస్టుమార్టంకు తరలించడం జరిగింది.


పోస్టు మార్టమ్‌ రిపోర్టు ఆధారం మీద కేసు ముందుకు వెళుతుంది. ఇక ఆమె కెరియర్ విషయానికి వస్తే.. టీవీ షో ల ద్వారా ఆమె తన కెరీర్ ను మొదలుపెట్టింది. టీవీ సీరియల్స్ లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. స్త్రీ అనే మూవీ ద్వారా టెలివిజన్ లోకి అడుగుపెట్టి క్రమంగా సినీ ఫీల్డ్ లోకి కూడా ఎంటర్ అయింది. సిటీ ఆఫ్ గాడ్, మేరిక్కుందోరు కుంజాడు, బాంబే మార్చ్, కార్యస్థాన్, ఒన్ వే టికెట్, అద్బుతద్వీపు ఇలాంటి పలు చిత్రాలలో ఆమె నటించింది.

గత కొద్ది కాలంగా మలయాళ సినీ నటులు ఇలా సూసైడ్ చేసుకున్నారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల మలయాళ నటి అపర్ణ నాయర్ కూడా ఇదే రకంగా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంది. ఇంకా ఆ వార్త నుంచి తేరుకోక ముందే ఇప్పుడు రంజూషా మీనన్ పాపం ఇలా చేసుకుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×