BigTV English

RGV: అల్లు అర్జున్ ముఖం చూసి వాళ్లు వాంతులు చేసుకుంటారని అన్నాడు

RGV: అల్లు అర్జున్ ముఖం చూసి వాళ్లు వాంతులు చేసుకుంటారని అన్నాడు

RGV:  వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అంటాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలు, సెలబ్రిటీలు, రాజకీయాలు ఏది వదలడు. వివాదాలతో, విమర్శలతో నిత్యం  సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ తిరుగుతున్నాడు. ఇక అంత మంచి సినిమాలు తీసిన వర్మ .. అమ్మాయిలతో  అసభ్యకరమైన సన్నివేశాలను కథగా  రాసి సినిమాలు తీస్తున్నాడు. అయితే అవన్నీ అప్పుడండీ .. ఇప్పుడు నేను మారిపోయాను అంటూ సత్య రీ రిలీజ్ సమయంలో చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్టే సిండికేట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు.


సినిమాల విషయం పక్కన పెడితే.. మొదటి నుంచి వర్మకు మెగా ఫ్యామిలీలో కేవలం అల్లు అర్జున్ తప్ప ఏ హీరో నచ్చడు. ఈ విషయాన్నీ వర్మ ఎన్నోసార్లు బహిరంగంగా కూడా చెప్పాడు. అసలైన మెగాస్టార్ అల్లు అర్జున్ అని, అతడి తరువాతే ఎవరైనా అని ఎన్నోసార్లు ట్వీట్ చేశాడు కూడా.  మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్ రివ్యూ ఇస్తూ.. “నేను పుష్ప 2ని ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు GC చూసిన తర్వాత.. అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ల మీద పడాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ” ఆ ప్రొడ్యూసర్  పేరు చెప్పను కానీ, పుష్ప సినిమా వచ్చినప్పుడు.. ఒకరితో అతను అన్నాడట. అల్లు అర్జున్ ముఖం చూసి నార్త్ వాళ్ళు వాంతులు చేసుకుంటారు అని.. తెల్సిన వ్యక్తి నాతో చెప్పాడు. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్ పుష్ప 2 చూసి పీడకలలు వస్తుండొచ్చు. బాంద్రాలో తిరిగేవారు ఎప్పటికీ పుష్ప లాంటి సినిమాను తీయలేరు.


Tammareddy Bharadwaj: అర్ధరాత్రి మందు తాగి హీరోయిన్ల తలుపులు కొడతారు.. అమ్మాయిల వీక్ నెస్.. ?

నార్త్ ప్రొడ్యూసర్స్ కి హీరోలు అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి. అందంగా కనిపించాలి. సౌత్ డైరెక్టర్స్ అలా కాదు. వారికి కనీసం మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. కానీ, మూలాలు తెలిసినవారు. వాటితోనే కనెక్ట్ అవుతారు. మేధావులుగా కనిపించరు.. ప్రేక్షకులకు ఎలాంటి మాస్ కావాలి అనేది వారికి తెలుసు. అలా సినిమాలు తీయడం ఒక బాలీవుడ్ డైరెక్టర్ కు అసాధ్యమని చెప్తాను. కంటెంట్ ఉంటే ఏ భాషలోనైనా సినిమాను చూస్తారు ప్రేక్షకులు.

స్టార్లు ఎప్పుడు స్టార్లులానే కనిపించాలి. అలా కాకుండా వేరే పాత్రల్లో కనిపిస్తే ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అయిపోతారు. నార్త్ లో స్టోరీ మొత్తంపైన ఫోకస్ చేస్తారు. సౌత్ లా అలా కాకుండా సీన్స్ పై డోకాస్ ఎక్కువ ఉంటుంది. ఒక స్టార్ హీరో నాతో ఒక మాట అన్నాడు. స్టోరీ అడగను.. నా ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది మాత్రమే అడుగుతాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక బన్నీ గురించి ఆర్జీవీ చెప్పినవన్నీ నిజాలే. పుష్ప సమయంలో బాలీవుడ్ లో బన్నీకి అస్సలు మార్కెట్ లేదు. చాలామంది  అప్పటికీ బన్నీని గుర్తించలేదు అనే చెప్పాలి. కేరళ సైడ్ మాత్రమే బన్నీ సుపరిచితుడు. నార్త్ సైడ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నది పుష్ప సినిమా వలనే. ఆ సినిమా ఎంత క్రేజ్ ను ఇచ్చిందంటే.. పుష్ప 2 తో బాలీవుడ్ లో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ఇక ఈ క్రేజ్ తో బన్నీ బాలీవుడ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. త్వరలోనే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఉండబోతుందని టాక్. మరి బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి డైరెక్టర్ ఎవరు అనేది చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×