Ind Vs Eng 3rd Odi: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ వన్డేలో… రోహిత్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుపైన ఏకంగా 142 పరుగుల తేడాతో విజయం సాధించింది రోహిత్ శర్మ సేన. దీంతో వరుసగా మూడు వన్డేలు.. గెలిచి 3-0 తేడాతో సిరీస్ ఎగురేసుకుపోయింది టీమిండియా. అటు టి20 సిరీస్ అలాగే వన్డే సిరీస్ కోల్పోయిన… ఇంగ్లాండ్ తీవ్ర నిరాశకు లోనైంది.
Also Read: Sheheen Afridi vs Matthew Breetzke: షాహిన్ అఫ్రిదిపై సౌతాఫ్రికా ప్లేయర్ దాడి..వణికిపోయిన పాక్ ?
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా… నిర్ణీత 50 ఓవర్ లో 356 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… ఇంగ్లాండ్ జట్టు 214 పరుగులు చేసి ఆల్ అవుట్ కావడం జరిగింది. దీంతో… 142 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించడం జరిగింది. ఇక టీమిండియా ఇన్నింగ్స్ ఒకసారి పరిశీలిస్తే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ వన్డేలో సెంచరీ చేసి దుమ్ము లేపాడు. మూడవ వన్డే వచ్చేసరికి రెండు బంతులు ఆడి ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభమాన్ గిల్ ఏకంగా 112 పరుగులు చేసి దుమ్ము లేపాడు. మొదటి రెండు వన్డేలలో వైస్ కెప్టెన్ గిల్ తన పాత్ర పోషించాడు.
ఆ రెండు ఇన్నింగ్స్ లో..హాఫ్ సెంచరీలు చేసి దుమ్ము లేపాడు. ఇక చివరి వన్డేలో… సెంచరీ చేసి రాణించాడు. తన ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు 14 బౌండరీలు ఉన్నాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అటు శ్రేయస్ అయ్యర్ మరోసారి 78 పరుగులతో దుమ్ము లేపాడు. దాటిగా ఆడి భారీ స్కోర్ చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) కూడా లైన్ లో పడ్డట్టు తెలుస్తోంది. 29 బంతుల్లో 40 పరుగులు చేసి దుమ్ము లేపాడు కేఎల్ రాహుల్ ( KL Rahul ). రాహుల్ ఇన్నింగ్స్ లో ఒక సిక్సర్ కూడా ఉంది. అటు హార్దిక్ పాండ్యా ఇవాళ 17 పరుగులకు అవుట్ కావడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 214 కు ఆల్ అవుట్ అయింది. 34.2 ఓవర్లలోనే… కుప్పకూలింది ఇంగ్లాండ్.
అయితే… టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే… ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా హర్షిత్ రానా 5 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇటు స్పిన్నర్లు కూడా అద్భుతంగా రాణించారు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా… వాషింగ్టన్ సుందర్ 1 అలాగే కుల్దీప్ యాదవ్ ఒకటి తీశారు. హార్దిక్ పాండ్యాకు రెండు వికెట్లు పడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందే… ఈ విజయం సాధించడం టీమిండియా కు ప్లస్ కానుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ ఫాంలోకి రావడానికి ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ తొడ్పడిందని చెప్పవచ్చును.
Also Read: CCL Cricket Free Passes: వాలంటైన్స్ ఆఫర్..ఉప్పల్ తెలుగు వారియర్స్ మ్యాచ్ లు ఫ్రీగా చూడండి ?
TEAM INDIA – THE CHAMPIONS. 🇮🇳 pic.twitter.com/rhk38XHvq9
— Tanuj Singh (@ImTanujSingh) February 12, 2025