IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ( IPL ) ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 17 సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్… సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే ఐపీఎల్ సక్సెస్ కావడంతో ఇతర దేశాలు కూడా ఇలాంటి టోర్నమెంట్లో నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ లో PSL … సౌత్ ఆఫ్రికా t20 లీగ్ , BBL, సిపిఎల్, అలాగే MLC ఇలాంటి ఎన్నో లీగ్ టోర్నమెంట్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇందులో… టీమిండియా ( Team India ) క్రికెటర్లు ఎక్కడ ఆడ బోరు. ఐపీఎల్ ఆడిన ప్రతి టీమిండియా క్రికెటర్… ఇతర లీగ్ మ్యాచ్ను ఆడకూడదు. టీమిండియా కు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. బయట ఏ ఫ్రాంచైజీ తోనైనా ఆడుకోవచ్చు.
Also Read: Telugu Warriors vs Bengal Tigers: తెలుగు వారియర్స్ కు అగ్ని పరీక్ష..గెలవకపోతే ఇంటికే ?
కానీ టీమిండియా జట్టుకు వాడుతూ ఇతర టోర్నమెంట్లు అసలు ఆడకూడదు. కేవలం ఐపిఎల్ మాత్రమే ఆడాలి. అయితే.. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఉన్న చాలా ఫ్రాంచైజీలు ఇతర లీగ్లలో కూడా జట్లను కొనుగోలు చేశాయి. అక్కడ ఫ్రాంచైజీలకు ఎలాంటి రూల్స్ లేవు. కాబట్టి ఏ టోర్నమెంటులో ఆయన జట్లను కొనుగోలు చేసే ఛాన్స్ వాళ్లకు ఉంది. కానీ టీమిండియా ప్లేయర్లు మాత్రమే ఎక్కడ పడితే అక్కడ ఆడకూడదన్నమాట. అయితే.. తాజాగా ది 100 లీగ్ లోకి ( The Hundred Cricket league ) కూడా… హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో ఇలా నాలుగు యాజమాన్యాలు… ది 100 లీగ్ లో పెట్టుబడులు పెట్టాయి. దాదాపు 30 శాతం వాటాను… ఏకంగా 3300 కోట్లతో కొనుగోలు చేశాయట.
అంటే ఇకపైన ది 100 లీగ్ లో కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సంబంధించిన జట్లు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా టీమిండియా ప్లేయర్లు ఆడడానికి వీలు లేదు. ఇది ఇలా ఉండగా… ది 100 లీగ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడున్నారని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడకుండా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి కండిషన్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడారు. కానీ అంతర్జాతీయ సమస్యల కారణంగా వాళ్లను టోర్నమెంట్ నుంచి తొలగించారు.
Also Read: IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడ ఫ్రీగా చూడవచ్చు ?
అప్పటి నుంచి వాళ్లపై నిషేధం కొనసాగుతోంది. అయితే.. ది 100 టోర్నమెంట్లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడితే…. ఇండియాకు చెందిన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అలాగే లక్నో ఫ్రాంచైజీలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ… పాకిస్తాన్ ప్లేయర్లు ది హండ్రెడ్ టోర్నమెంటులో ఆడతారని తెలుస్తుంది. అదే జరిగితే మన ఐపిఎల్ ఫ్రాంచైజీ లపై భారత్ అభిమానులు ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. శత్రుదేశానికి ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్ల ఓనర్లు సహాయం చేస్తున్నారని కూడా ఫాన్స్ మండిపడే ఛాన్స్ ఉంది. మరి దీనిపై ది 100 లీగ్ యాజమాన్యం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.