RGV On Triptii Dimri: త్రిప్తి దిమ్రి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అనిమల్ సినిమాలో కనిపించింది కొద్దిసేపు అయినా కూడా పెద్ద రచ్చ లేపారు. కేవలం ఈమె సీన్స్ కోసమే మళ్లీ మళ్లీ ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు ఉన్నారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. జోయా అనే క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ చూపించిన విధానం చాలామంది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా చాలా సంచలనాలకు, వివాదాలకు దారితీసింది. ఇప్పటికీ కూడా తన పేరు చెప్పిన వెంటనే తను అనిమల్ సినిమాలో చేసిన సీన్స్ కళ్ళ ముందు కదలాడుతాయి.
స్పిరిట్ సినిమాలో హీరోయిన్
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తాను తీసిన అనిమల్ సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ తరుణంలో సందీప్ చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం సందీప్ ఆన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా దీపిక పదుకొనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి ఆమెను తొలగించారు. ఆమె ప్లేస్ లో త్రిప్తి దిమ్రి ను హీరోయిన్ గా ప్రకటించారు.
Also Read : Victory Venkatesh : సైకిల్ మెకానిక్ అవుతానన్నాడు, కానీ కలెక్టర్ అయ్యాడు
అనిమల్ కంటే ఎక్కువ చూపించాలి
ఈ అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే చాలామంది చాలా రకాలుగా స్పందించారు. కానీ ఆర్జీవి స్పందన మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇది బాలీవుడ్లో బిగ్గెస్ట్ సెన్సేషన్ అవుతుంది అంటూ రాంగోపాల్ వర్మ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ కు త్రిప్తి దిమ్రి కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆర్జీవి త్రిప్తి దిమ్రి కు రిప్లై గా అనిమల్ సినిమాలో కంటే కూడా నువ్వు ఈ సినిమాలో టాలెంట్ చూపిస్తావు అని నాకు తెలుసు అని తనదైన శైలిలో మరో ట్వీట్ చేశాడు. ఒకప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ. ఇప్పుడు మాత్రం తనకు అనిపించింది చాలా ఓపెన్ గా అనేస్తూ అనునిత్యం పబ్లిక్ లో అలర్ట్ గా ఉంటారు. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఏ రేంజ్ ట్వీట్ చేస్తారు అని చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది.
I know you will KILL IT from the SPIRIT you showed in ANIMAL https://t.co/KlzwQpRwlm
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2025