Robinhood :టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) తాజాగా నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్ (Robin hood). వెంకీ కుడుముల(Venky kudumula) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల (Sree Leela) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ‘పుష్ప’మూవీ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అభిమానులను పూర్తి ఎక్సైట్మెంట్ కు గురిచేసిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఎన్నాళ్ళ నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా ఆ వార్తలు కాస్త నిజమయ్యాయి. అంతేకాదు డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది. మొత్తానికైతే రాబిన్ హుడ్ నుండి డేవిడ్ వార్నర్ కు సంబంధించిన లుక్ ను విడుదల చేయడంతో ఈ లుక్ లో డేవిడ్ వార్నర్ అదిరిపోయారు అని చెప్పవచ్చు. ఇంకా పోస్టర్ రిలీజ్ చేస్తూ క్రికెట్ బౌండరీ నుంచి బాక్సాఫీస్ వరకు ఇండియన్ సినిమాలోకి డేవిడ్ వార్నర్ కు స్వాగతం. ఆయన చేసే కామెడీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం అంటూ చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ విషయం చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. మైదానంలో అద్భుతాలు సృష్టించిన డేవిడ్ వార్నర్ ఇక వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి అంటూ ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
డేవిడ్ వార్నర్ విషయానికి వస్తే.. ఐపిఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున చాలా కాలం పాటు ఆడిన ఈయన 2016లో ఈయన నాయకత్వంలోనే ఎస్ఆర్హెచ్ ఐపిఎల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ మరోసారి కప్పును అందుకోలేకపోవడం గమనార్హం. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్ గా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెట్ జాతీయ జట్టు నుండి కెప్టెన్ గా, టెస్ట్ వైస్ కెప్టెన్ గా రిటైర్మెంట్ తీసుకున్న ఈయన ..132 సంవత్సరాల లో.. మెరుగైన అనుభవం లేకపోయినా జాతీయ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా ఇతనే. ముఖ్యంగా 2015 క్రికెట్ ప్రపంచ కప్, 2023 ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తో పాటు 2021 టీ20 ప్రపంచ కప్పులు విజయం సాధించడంలో ఆస్ట్రేలియా జట్టులో కీలక పదవి పోషించారు ఇక 2021 t20 కప్ లో ఆయన ప్రదర్శనల ఫలితంగా “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్”గా కూడా ఎంపికయ్యారు. ఇంకా ఎడమచేతి వాటం కలిగిన ఈయన బ్యాటింగ్లో అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఇక క్రికెట్ ను కాస్త పక్కన పెట్టి.. ఇప్పుడు సినిమాల్లోకి అడుగుపెడుతున్న డేవిడ్ తన కామెడీతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
'రాబిన్ హుడ్' మూవీ నుంచి డేవిడ్ వార్నర్ లుక్
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న 'రాబిన్ హుడ్' మూవీ
ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన డేవిడ్ వార్నర్
తాజాగా వార్నర్ లుక్ సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం pic.twitter.com/IGLyGlA4J9
— BIG TV Breaking News (@bigtvtelugu) March 15, 2025