BigTV English

Anjeer: వీళ్లు.. అంజీర్‌ అస్సలు తినకూడదు !

Anjeer: వీళ్లు.. అంజీర్‌ అస్సలు తినకూడదు !

Anjeer: అంజీర్ ఒక రుచికరమైన, పోషకాలు కలిగిన పండు. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ, గుండె ఆరోగ్యం, చర్మానికి మేలు చేస్తాయి. అంజీర్ పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలకు కూడా వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు అంజీర్ లను తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఉంటాయి. మరి ఇంకా ఎవరెవరు అంజీర్ తినకుండా ఉండాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


అంజీర్ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర సమస్యలు, జీర్ణ సమస్యలు బరువు పెరుగుతాయి. దీంతో పాటు, అంజీర్ పండ్లు అలెర్జీలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తాయి. అందుకే అంజీర్ పండ్లను సమతుల్య పరిమాణంలో తినాలి.

అంజీర్ పండ్లు తినడం వల్ల కలిగే 5 నష్టాలు :


బరువు పెరగడానికి కారణమవుతుంది:
అంజీర్ పండ్లలో సహజ చక్కెరలు , కేలరీలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఎండిన అంజీర్ పండ్లను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు , చక్కెరలు పెరుగుతాయి. అంతే కాకుండా ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు అంజీర్ తినకుండా ఉంటేనే మంచిది.

కడుపులో గ్యాస్ , అజీర్ణం:
అంజీర్ పండ్లలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. కానీ వీటిని అధికంగా తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇది ఒక సమస్య కావచ్చు. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు అంజీర్ తినకుండా ఉండాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు.  అంజీర్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయినప్పటికీ జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు తినకుండా ఉండాలి.

దృష్టిపై ప్రభావం:
అంజీర్ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. అంతే కాకుండా ఇది కళ్ళలో వాపుకు కారణమవుతుంది లేదా దృష్టిని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే కంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. తినకుండా ఉంటనే బెటర్.పొటాషియం స్థాయి పెరిగినప్పుడు కంటి సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి.

Also Read: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు లైట్ తీసుకోవద్దు !

రక్తంలో చక్కెర స్థాయి:
అంజీర్ పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. డయాబెటిక్ రోగులు అధికంగా అంజీర్ పండ్లను తింటే అది వారి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది వారి ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే డయాబెటిస్ ఉన్న వారు అంజీర్ లను తినకుండా ఉంటేనే మంచిది. అధికంగా రక్తంలో చక్కెర ఉంటే మీరు అంజీర్ లను తినకుండా ఉండటం మంచిది.

అలెర్జీలు , చర్మ సమస్యలు:
కొంతమంది అంజూర్ పండ్లను తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన చర్మంపై దద్దుర్లు, దురద లేదా వాపు వస్తుంది. అంజీర్ పండ్లను ఎక్కువగా తింటే ఇది మరింత తీవ్రం అవుతుంది.

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×