Harsha Sai : బెట్టింగ్ యాప్స్ (Betting App) వివాదం టాలీవుడ్ ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది యువత బెట్టింగ్ యాప్స్ కు బానిసై, అప్పుల బారిన పడుతున్నారు. ఆ తర్వాత అప్పులు తీర్చలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఈ ఊబిలోకి దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పేది నమ్మి దీంట్లోకి అడుగు పెట్టే యూత్ ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇక వీటిని ప్రమోట్ చేయడం ద్వారా ఇన్ఫ్లూయెన్సర్లు భారీగానే సంపాదిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సెలబ్రిటీలు అప్రమత్తమయ్యారు. తాజాగా ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై సీరియస్
యూత్ ని బెట్టింగ్ వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని సజ్జనార్ ఇప్పటికే స్థానిక పోలీసులకు సూచించారు. అంతేకాకుండా తన ట్వీట్లకు ఇన్ఫ్లూయెన్సర్లను ట్యాగ్ చేసి పోలీసులను అలర్ట్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసి లోపలేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సూర్యాపేటకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్ లపై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఇన్ఫ్లూయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాలోని బెట్టింగ్ ప్రమోషన్ల వీడియోలను తొలగిస్తున్నారు. తాజాగా సజ్జనార్ మరోసారి సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై ఫైర్ అయ్యారు. చేసేది సంఘసేవ కాదు, అరెస్ట్ చేయండి అంటూ సీరియస్ అయ్యారు ఆయన. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లూయెన్సర్లని అన్ ఫాలో చేయాలని సజ్జనార్ యూత్ ని కోరారు.
హర్ష సాయిపై స్పెషల్ ఫోకస్
“ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడానికి మీరంతా మీ బాధ్యతను నిర్వహించండి. ఓ ఛానల్లో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai) ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తను బెట్టింగ్ ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని చెప్పాడు. అసలు చేస్తున్నదే తప్పయితే అదేదో సంఘసేవ చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడు చూడండి. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలవుతుంటే, కనీసం పశ్చాత్తాపం లేదు. ఇలాంటి వాళ్లకు డబ్బే సర్వసం” అంటూ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇక ఇప్పటికే హర్ష సాయి ఓ హీరోయిన్ ని చీట్ చేసిన విషయంలో కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సజ్జనార్ దృష్టిలో పడ్డాడు. కాబట్టి ఇతన్ని పోలీసులు వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు నెటిజన్లు. మరిప్పుడు హర్ష సాయిని అరెస్ట్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి : సజ్జనార్
వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి
ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి
ఓ ఛానల్ లో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ఇంటర్వ్యూ
తను బెట్టింగ్ యాప్ లను ప్రమోట్… pic.twitter.com/XRJf6flJMw
— BIG TV Breaking News (@bigtvtelugu) March 15, 2025